అనుష్కకు కొరటాల కండీషన్..!

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. [more]

Update: 2019-01-19 10:47 GMT

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే చిరు కొరటాల డైరెక్షన్ లో తీయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఫాల్గొననున్నాడు. ఈలోపు కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. అందుకుగానూ హీరోయిన్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. చిరు పక్క సరిపోయే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మనకు ముందు గుర్తొచ్చే పేర్లు కాజల్, నయనతార. చిరు వీరితో ఆల్రెడీ నటించారు కాబట్టి వీరిని కాకుండా మరో హీరోయిన్ ని చూడాలని నిర్ణయించుకున్నాడు.

బరువు తగ్గేందుకు డెడ్ లైన్

అనుకుందే తడవుగా అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే కొరటాల ఆమెను సంప్రదించినట్టు టాక్. కాకపోతే అనుష్కను చూసిన వారెవరూ ఆమెను హీరోయిన్ అని అనుకోవడం కష్టం. ఎందుకంటే ఈమధ్య అనుష్క బాగా లావయ్యింది. అయితే కొరటాల ఆమెకు ఓ కండిషన్ పెట్టాడట. మార్చి తరువాత షూట్ స్టార్ట్ అయ్యేలోగా వీలయినంత బరువు తగ్గి, కాస్త నాజూగ్గా తయారు కావాలన్నది ఆ కండిషన్. ప్రస్తుతం అనుష్క విదేశాలకు వెళ్లి బరువు తగ్గే ప్రయత్నంలో ఉందని సమాచారం. ప్రస్తుతం అనుష్క చేతిలో మాధవన్ హీరోగా కొన వెంకట్, పీపుల్స్ మీడియా నిర్మించే సినిమా మాత్రమే ఉంది.

Tags:    

Similar News