కొరటాల ప్లాన్ అదిరింది..!

Update: 2018-12-14 07:46 GMT

భరత్ అనే నేను తర్వాత దర్శకుడు కొరటాల శివ చిరుతో సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఎప్పుడూ మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించే కొరటాల శివ ఈసారి కూడా చిరంజీవితో ఒక ఠాగూర్ తరహా కథను పక్కాగా సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది ఈ సినిమా ద్వారా ఒక స్ట్రాంగ్ మెస్సేజ్ సమాజానికి ఇవ్వడానికి కొరటాల ప్లాన్ చేస్తున్నాడనే విషయం ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు... కొరటాల సినిమా కోసం ఫిబ్రవరి నుండి తయారవుతాడని.. ఈ మూవీ సంక్రాతి తర్వాత మొదలవ్వబోతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కోసం కొరటాల హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. సైరా నరసింహరెడ్డిలో చిరు సరసన నటిస్తున్న నయనతారే చిరు పక్కన కొరటాల సినిమాలో నటిస్తుందట.

కీలక పాత్రలో రామ్ చరణ్ తేజ్...

మాములుగా కొరటాల శివ - చిరు సినిమా అంటేనే ప్రేక్షకుల్లో, ట్రేడ్ మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ క్రేజ్ ని మరింత పెంచే ప్లాన్ కొరటాల చేస్తున్నాడట. అది కూడా అలాంటి ఇలాంటి ప్లాన్ కాదట. కొరటాల చిరు కోసం రాసే కథలో ఒక కీలక పాత్రని రాసుకున్నాడట. అయితే ఆ పాత్ర కోసం చిరు తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్ ని తీసుకోబోతున్నాడట. మరి చిరు ఖైదీ నెంబర్ 150 లో రామ్ చరణ్ ఒక సాంగ్ లో మెరిస్తే... చిరు, రామ్ చరణ్ ఒకటిరెండు మూవీస్ లో మెరిశాడు. అయితే కొరటాల ఈ సినిమాలో రామ్ చరణ్ కి గెస్ట్ లాంటి పాత్రని ప్రత్యేకంగా డిజైన్ చేసాడట. మరి ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్ర కాకుండా కొన్ని నిమిషాల పాటు చరణ్ ని ఈ మూవీ లో మనం చూడొచ్చని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా మీద ఉన్న అంచనాలు.. చరణ్ రాకతో మరింత పెరుగుతాయని కొరటాల ఇలా ప్లాన్ చేసాడట. మరి కీలక పాత్ర అంటే కథకు అదెంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అన్నమాట. మరి తండ్రి సినిమాలో కొడుకు నటించడం మాత్రం సూపర్ అంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే పండగ చేసేసుకుంటున్నారు.

Similar News