చిరు తరువాత కొరటాల ఎవరితో తెలుసా..?

Update: 2018-11-15 08:02 GMT

కొరటాల శివకి సినిమా ఎలా తీయాలో, ప్రేక్షకుల నాడి ఎలా పట్టాలో బాగా తెలుసు. అందుకనే అతని సినిమాలు హిట్ అవుతుంటాయి. 'మిర్చి' దగ్గర నుండి 'భరత్ అనే నేను' వరకు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో రెండు మూడు నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా తుడిచిపెట్టాయి. మరి అటువంటి కొరటాలతో ఏ స్టార్ కు సినిమా చేయాలని ఉండదు చెప్పండి.! అల్లు అర్జున్ సైతం కొరటాలతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాడు కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇక నాగార్జున కూడా అఖిల్ కోసం కొరటాలను లైన్ లో పెట్టి అతనికి ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అయితే కొరటాల మాత్రం చిరంజీవితో సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ప్రస్తుతం 'సైరా' షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు ఈ సినిమా తరువాత కొరటాల డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకి కూడా చరణే నిర్మాత.

తండ్రీకొడుకులు ఇద్దరూ కొరటాలతోనే...

ఇదిలా ఉంటే కొరటాలకి చరణ్‌ రెండు సినిమాలకి అడ్వాన్స్‌ ఒకేసారి ఇచ్చేశాడని టాక్‌ వినిపిస్తోంది. చిరంజీవితో చేసే సినిమా కాకుండా తనతో కూడా ఓ సినిమా చేయడానికి చరణ్ అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం. నిజానికి వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాలి కానీ అది ఆగిపోయింది. ఈ లోపు చరణ్... బోయపాటి సినిమాతో తరువాత #RRR తో బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. రాజమౌళి చిత్రం పూర్తయ్యే సరికి కొరటాలను సినిమా క్యూలో పెట్టాలనేది చరణ్‌ ఐడియానట. కాబట్టి కొరటాల మరో మూడేళ్ల పాటు మెగా కాంపాండ్ కి అంకితం కాబోతున్నాడు.

Similar News