కొరటాలతో శ్రీనివాస్ ఆత్రేయ?

అదేమిటి చిరంజీవి ఆచార్య ని కొరటాల తేరకెక్కిస్తున్నాడు. తర్వాత అల్లు అర్జున్ మూవీకి కమిట్ అయ్యి ప్రకటన కూడా ఇచ్చేసాడు. మధ్యలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ [more]

Update: 2020-10-14 09:14 GMT

అదేమిటి చిరంజీవి ఆచార్య ని కొరటాల తేరకెక్కిస్తున్నాడు. తర్వాత అల్లు అర్జున్ మూవీకి కమిట్ అయ్యి ప్రకటన కూడా ఇచ్చేసాడు. మధ్యలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ హీరో నవీన్ పోలిశెట్టి కొరటాలతో సినిమా ఏమిటి అనే కన్ఫ్యూషన్ లో ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ అటు నిర్మాతగానూ, ఇటు దర్శకుడిగానూ సినిమాలు చేస్తున్నాడు. చిరు తో ఆచార్య సినిమా తో పాటుగా కొత్త కథలను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఆ కథలతో సినిమాలు చెయ్యడానికి కాదు.. ఓటిటి వాళ్ళకి కొరటాల వెబ్ సీరీస్ చెయ్యడానికి. అదిగో అందుకే శ్రీనివాస్ ఆత్రేయ అదేనండి నవీన్ పోలిశెట్టి తో కొరటాల వెబ్ సీరీస్ ప్లాన్  చేసాడు.

ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ తో డీల్ మాట్లాడిన కొరటాల శివ.. నవీన్ పోలిశెట్టితో వెబ్ సీరీస్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ వెబ్ సీరీస్ కి కొరటాల శివ శిష్యుడు దర్శకత్వం వహిస్తాడని.. కొరటాల కేవలం కథ, ఇటు నిర్మాతగానూ కొనసాగుతాడు.. అయితే వెబ్ సీరీస్ డైరెక్షన్ కూడా కొరటాల శివ కనుసన్నల్లోనే జరగబోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో అదరగొట్టిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాని పూర్తి చేసాడు. ఇక కొరటాల నవీన్ అయితే తన వెబ్ సీరీస్ కి పర్ఫెక్ట్ అని నవీన్ పోలిశెట్టితో మాట్లాడి ఓకే చేసాడని అంటున్నారు. నవీన్ కూడా కొరటాల కథకి ఇంప్రెస్స్ అయ్యి ఈ వెబ్ సీరీస్ కి ఒప్పేసుకున్నాడనే టాక్ నడుస్తుంది.

Tags:    

Similar News