చిరంజీవిని మార్చేస్తున్న కొరటాల

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా షూటింగ్ పూర్తి కాగానే చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కొరటాల దర్శకత్వంలో చెయ్యబోతున్న విషయం తెలిసిందే. సైరా నరసింహారెడ్డి [more]

Update: 2019-03-21 09:08 GMT

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా షూటింగ్ పూర్తి కాగానే చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కొరటాల దర్శకత్వంలో చెయ్యబోతున్న విషయం తెలిసిందే. సైరా నరసింహారెడ్డి కోసం బారు మీసం, కాస్త గెడ్డం పెంచిన చిరు కొరటాల సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవుతాడని.. ఇప్పుడున్న బరువు కూడా చిరు తగ్గాల్సి ఉంటుందని అంటున్నారు. సైరా లుక్ కోసం కాస్త లావుగా గుమ్మటంగా కనబడిన చిరంజీవి.. కొరటాల మూవీ కోసం మాత్రం కంపల్సరీ సన్నబడాల్సిందేనట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. చిరు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు సినిమాని పట్టాలెక్కించేందుకు తయారుగా ఉన్నాడు.

డీసెంట్ లుక్ లో

అయితే చిరుతో కొరటాల తన సినిమాలోని లుక్ కోసం తాజాగా ఫోటో షాట్ కూడా చేయించాడట. ఇప్పటివరకు చిరంజీవిని ఎవరూ చూపించినంత డిఫ్రెంట్ లుక్ లో చూపించాలనే తపనతో కొరటాల ఉన్నాడట. ఇక కొరటాల మూవీలో చిరు రైతుగా కనిపిస్తాడని టాక్ ఉంది. ఇప్పటికే ఒక లుక్ ని అనుకున్నాడని.. ఆ లుక్ ను ఫైనల్ చేసుకుని షూటింగు సమయానికి చిరంజీవిని కొంత బరువు తగ్గవలసి ఉంటుందని కొరటాల సూచించినట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఖైదీ నెంబర్ 150, సైరాలోనూ బాగా బొద్దుగా ఉన్న చిరుని చూసిన ప్రేక్షకులు.. కొరటాల మూవీలో మెగాస్టర్ రేంజ్ లుక్ లో చూడబోతారన్నమాట.

Tags:    

Similar News