మెగా డాటర్ కూడా మొదలెట్టేసిందిగా

Update: 2018-07-16 05:18 GMT

మెగా ఫ్యామిలీ హీరోస్ కాదు మెగా డాటర్ కూడా ఇప్పుడు సినిమాల్లో తనని ప్రూవ్ చేసుకోవడానికి తహతహలాడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఒక మనసు సినిమాతో ఆకట్టుకోగా... ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదుగాని మెగా డాటర్ నిహారికకు మంచి పేరొచ్చింది. అలాగే తమిళంలోనూ ఈ మెగా పిల్ల అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక తాజాగా తెలుగులో సుమంత్ అశ్విన్ తో జోడి కట్టి నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రెడిషనల్ గా అందమైన డ్రెస్సులతో నిహారిక బాగా ఆకట్టుకుంటుంది. గ్లామర్ గా ఉంటూనే అందాలు ఆరబొయ్యకుండా ఇప్పడి ట్రెండ్ కి సరిపడా నిహారిక చాలా పద్దతిగా బావుంటుంది. ఇక హ్యాపీ వెడ్డింగ్ సినిమాలోనూ నిహారిక ట్రెడిషనల్ గా కనబడుతూనే మోడ్రెన్ అమ్మాయిలాగా అదరగొట్టేసిందని సెన్సార్ టాక్ కూడా ఉంది. మరి మీడియం బడ్జెట్ సినిమా అయిన ఆ సినిమా హిట్ అయ్యింది అంటే నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకున్నట్టే.

ఇక హీరోయిన్స్ అవకాశాల కోసం హాట్ హాట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారు విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తారు. కేవలం సినిమా అవకాశాల కోసమే హీరోయిన్స్ ఈ విధంగా రెచ్చిపోతారు. ఇక ఇప్పుడు మెగా డాటర్ కూడా ఇలా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో మరి హాట్ హాట్ ఫొటోస్ తో కాకుండా చాలా ట్రెడిషనల్ గా పద్దతిగా... క్యూట్ అండ్ షార్ప్ లుక్స్ తో ఉన్న ఫొటోస్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ తాను హీరోయిన్ అనే విషయాన్నీ అందరూ మర్చిపోకుండా చేస్తుంది. మరి నిహారిక పద్ధతైన ఫొటోస్ ని అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే... అటు మెగా ఫాన్స్ మాత్రమే కాదు... ఇటు మాములు ప్రేక్షకులు కూడా మెగా డాటర్ తెలివితేటల్ని మెచ్చుకుంటున్నారు. కానీ గ్లామర్ ఫీల్డ్ లో ఎన్నిరోజులు ఇంత ట్రెడిషనల్ గా నెట్టుకు రాగలదో సరిగ్గా తెలియదు. మరి హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ కాదు.... నటన కూడా ముఖ్యమే. చూద్దాం నిహారిక కెరీర్ ఎలా వుండబోతుందో అనేది

Similar News