విశాల్ నిర్ణయానికి షాక్ అయిన కోలీవుడ్..!

Update: 2018-11-26 07:01 GMT

తెలుగువాడైనా విశాల్ కోలీవుడ్ కి వెళ్లి అక్కడ చిన్న హీరో నుండి పెద్ద హీరో స్థాయికి వెళ్లాడు. కోలీవుడ్ లో మాస్ ఇమేజ్ ను దక్కించుకున్న విశాల్ నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచి కీలక పదవులతో కోలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరాడు. తెలుగువాడు కావడంతో అక్కడి పెద్దవాళ్లకి విశాల్ అంటే గిట్టటం లేదు. అతన్ని డీగ్రేడ్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విశాల్ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయినా విశాల్ ని రెచ్చగొడుతూనే ఉన్నారు. రీసెంట్ గా తమిళనాడులో గజ తుఫాను వల్ల చాలా గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. అందులో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు విశాల్ ప్రకటించాడు. ఆల్రెడీ దానికి సంబంధించి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాడు. దీన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తానని కూడా ప్రకటించాడు.

విశాల్ కి పెరిగిన ఇమేజ్

దాంతో అక్కడ జనాలకు దేవుడిలా మారాడు విశాల్. నడిగర్ సంఘం, నిర్మాతల మండలి తరఫున తుఫాను బాధితులకు సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అతడికి జనాల్లో విశాల్ కు ఇమేజ్ పెరిగింది. అక్కడ సినీ రంగం కూడా విశాల్ తీసుకున్న నిర్ణయానికి ఆశర్యపోతున్నారు. అతడి తాజా నిర్ణయం మిగతా ఇండస్ట్రీ జనాల మీద ఒత్తిడి తెస్తోంది. విశాల్ ను తిట్టే పెద్దలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. వాళ్లు ఇప్పుడు విశాల్ ని ఏమీ అనలేని పరిస్థితి. విశాల్ చేతల మనిషి అని మరోసారి రుజువు చేసాడు.

Similar News