నయనతారపై రాధారవి వివాదస్పద వ్యాఖ్యలు

రాధారవి ఇటీవల గెస్ట్ గా ఓ ఫంక్షన్ కి వెళ్లి అక్కడ నయనతారపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసాడు. లేనిపోని వివాదం సృష్టించాడు రాధారవి. హీరోయిన్ నయనతారను ఉద్దేశించి [more]

Update: 2019-03-25 10:20 GMT

రాధారవి ఇటీవల గెస్ట్ గా ఓ ఫంక్షన్ కి వెళ్లి అక్కడ నయనతారపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసాడు. లేనిపోని వివాదం సృష్టించాడు రాధారవి. హీరోయిన్ నయనతారను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… నయన్ ఇటు దెయ్యంగా, అటు సీత గా ఒకేసారి నటించగలదని చెప్పాడు. అంతే కాదు చూపులతోనే వలలో వేసుకునే ఎవరితో అయినా సరే ఇప్పుడు దేవతల పాత్రలు వేయించేందుకు దర్శకులు వెనుకాడటం లేదని వెకిలిగా అనడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇలా అటుఇటుగా మాట్లాడిన రాధారవిపై కోలీవుడ్ ప్రముఖులు భగ్గుమంటున్నారు.

ఖండించిన కోలీవుడ్ ప్రముఖులు

రాధారవి వల్లే డబ్బింగ్ సంఘంలో చిన్మయి నిషేధానికి గురైందని వరలక్ష్మి శరత్ కుమార్ మరియు విజ్ఞేశ్ శివన్ ట్విట్టర్ వేదికగా నడిగర్ సంఘం మీద నిప్పులు కురిపించారు. కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు రాధారవిని ఇంకెప్పుడు తమ సినిమాల్లో తీసుకోమని శాశ్వత బ్యాన్ విధించాయి. విశాల్ సైతం చాలా ఆలస్యంగా స్పందించి ఖండిస్తూ స్టేట్ మెంట్ రిలీజ్ చేశాడు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Tags:    

Similar News