ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కియారా స్పెషల్ అట్రాక్షన్!

Update: 2018-04-08 09:46 GMT

ధోని సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన కియారా అద్వానీ టాలీవుడ్ లో తన మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేయడం మాములు విషయం కాదు. బాలీవుడ్ లో రెండుమూడు సినిమాలు చేసిన అనుభవంతో టాలీవుడ్ లో జాక్ పాట్ కొట్టేసింది. భరత్ అనే నేను సినిమా ట్రైలర్ లో కియారా చాలా ట్రెడిషనల్గా కనిపించింది.

కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హాట్ లుక్ తో అందరి మతులు పోగొట్టేసింది. ఆమె వేసుకున్నా వైట్ డ్రెస్సులో యువరాణిలా మెరిసిపోయింది.. అందంగా కనిపించటమే కాకుండా గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. మేకప్ కూడా బాగా కుదరడంతో ‘భరత్ అనే నేను’ ఈవెంట్లో చాలా ప్రత్యేకంగా కనిపించింది కియారా. ఆమె స్పీచ్ కూడా చాలా క్యూట్ గా ఉంది.

డైరెక్టర్ కొరటాల ఆమెను గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ సినిమాలో ఆమెది చాలా కీలక పాత్ర అని.. ‘ధోని’ సినిమా చూసి ఏరి కోరి ఆమెను తీసుకొచ్చానని.. చాలా బాగా నటించి మెప్పించిందని చెప్పాడు. సినిమా జరగటానికి ముందే తన డైలాగులు తెలుసుకుని ప్రాక్టీస్ చేసి వచ్చిందని తెలిపాడు. మహేష్ కూడా ఆమె గురించి చాలా బాగా మాట్లాడారు.

Similar News