అమ్మడుకి అవకాశాలు వరసబెడతాయనిపిస్తుంది

Update: 2018-04-21 07:23 GMT

నిన్న శుక్రవారం విడుదలైన మహేష్ బాబు - కియారా అద్వానీల 'భరత్ అనే నేను' సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది . పొలిటికల్ బ్యాగ్ద్రోప్ లో కొరటాల తెరకెక్కించిన ఈ సినిమాని క్రిటిక్స్ అంతా ఓవరాల్ గా హిట్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటనను అందరూ తెగ పొగుడుతున్నారు. అలాగే కొరటాల డైరెక్షన్ కి, స్క్రీన్ ప్లే కి, ఆయన మేకింగ్ స్టయిల్ కి అందరూ ఫిదా అవుతున్నారు. అలాగే సీఎం భరత్ గర్ల్ ఫ్రెండ్ కియారా అద్వానీకి కూడా మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్ నుండి టాలీవుడ్ లోకి 'భరత్ అనే నేను' తో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే హిట్ అయ్యింది. పొలిటికల్ బ్యాగ్ద్రోప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా దర్శకుడు కొరటాల ఎలాగోలా కియారా అద్వానీని ఇరికించాడు.

అయినా సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో మెప్పించింది. గ్లామర్ పరంగాను, మహేష్ తో రొమాంటిక్ సీన్స్ లో కియారా నటనను అందరూ పొగుడుతున్నారు. మరి 'భరత్ అనే నేను' విడుదల కాకుండా రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కియారా కి ఈ భరత్ హిట్ తో మరిన్ని ఛాన్స్ లు వస్తాయంటున్నారు. అమ్మడు మహేష్ బాబు పక్కన మొదటి సినిమా తోనే హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ అయ్యింది. మరి స్టార్ హీరోలు తమ సినిమాలకు కియారా ని ప్రిఫర్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు.

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే జెట్ స్పీడు తో గ్లామర్ పరంగా దూసుకుపోతూ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. మరి కియారా అద్వానీ కూడా 'భరత్ అనే నేను' హిట్ తో మరిన్ని అవకాశాలు తగిలి అమ్మడు కూడా టాలీవుడ్ ని ఏలే కళలు కనబడుతున్నాయి. చూద్దాం కియారాకి టాలీవుడ్ అవకాశాలు ఎంతవరకు వస్తాయో అనేది.

Similar News