రెడ్ హాట్ కైరా..

Update: 2018-12-17 05:40 GMT

తెలుగులోకి భరత్ అనే నేను అనే భారీ సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ కైరా అద్వానీ. బాలీవుడ్ భామలు అందాల ఆరబోతలో ఎంతగా రెచ్చిపోతారో అనేది మనం నిత్యం టాప్ మ్యాగజైన్స్ కవర్ పేజెస్ మీద, బాలీవుడ్ సినిమాల్లోనూ, అవార్డు ఫంక్షన్స్ లోను చూస్తూనే ఉంటాం. మరి కైరా అద్వానీ లో అలాంటి లక్షణాలు భరత్ అనే నేను లో పెద్దగా కనబడలేవు. కేవలం పాటల్లో తప్ప కైరా అందాలు ఆ సినిమాలో ఆస్వాదించలేకపోయారు. చాలా ట్రెడిషనల్ గా భరత్ లో కనబడిన ఈ భామ రామ్ చరణ్ తో వినయ విధేయరామాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే బోయపాటి వినయ విధేయరామాలో కైరా కి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఏ కోశానా కనబడ లేదు.

అందుకే కైరా తన ప్రమోషన్స్ తానే చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఒక ఫోటో దిగి మరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరా ఫోటో చూసిన ఎవ్వరైనా రెడ్ హాట్ కైరా సూపరేహే అంటారు. వినయ విధేయరామ లో రామ్ చరణ్ పక్కన రెండు మూడు పోస్టర్స్ లో హాట్ హాట్ గా కనబడిన కైరా ఇప్పుడు ఈ రెడ్ హాట్ డ్రెస్ లో రామ్ చరణ్ వినయ విధేయరామ సాంగ్ ని ప్రమోట్ చేస్తూ తస్సాదియ్యా అన్నట్టుగా అనిపిస్తుంది. మరి రామ్ చరణ్ వినయ విధేయరామ తస్సాదియ్యా డ్యూయెట్ ఈ రోజు సోమవారం సాయంత్రం 4.30 కి విడుదల కాబోతుంది.

మరా సాంగ్ లో కై రా అందాలు ఎలా కనిపించబోతున్నాయో కానీ.. ప్రస్తుతం ఈ పిక్ లో మాత్రం కైరా అందాలు అదరహో అన్నట్టుగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం కైరా అద్వానీ వినయ విధేయరామ తో పాటుగా బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ సరసన హాట్ హాట్ గా రెచ్చిపోతుంది. ఆ బాలీవుడ్ మూవీలో కైరా లిప్ లాక్స్ ఎలా ఉండనున్నాయి అంటూ అప్పుడే బాలీవుడ్ యూత్ ఎదురు చూసేస్తున్నారు కూడా.

Similar News