కియారా కిర్రాక్ పుట్టించిందిగా..!

మహేష్ బాబుతో జోడీ కట్టి భరత్ అనే నేనుతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఆ సినిమాతో స్టార్ రేంజ్ అందుకుంది. ఆ [more]

Update: 2019-03-07 06:21 GMT

మహేష్ బాబుతో జోడీ కట్టి భరత్ అనే నేనుతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఆ సినిమాతో స్టార్ రేంజ్ అందుకుంది. ఆ వెంటనే మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో నటించింది. అయితే భరత్ అనే నేను యావరేజ్ అయినా కియారాకి టాలీవుడ్ లో మంచి అవకాశు వస్తాయనుకున్నారు. కానీ వినయ విధేయ రామ దెబ్బకి ఈ పాప టాలీవుడ్ కి దూరమైంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో మూవీలో కియారానే హీరోయిన్ అనుకున్నారు కానీ వినయ విధేయ రామ ఎఫెక్ట్ కియారా మీద ఎక్కువగా పడడంతో ఆ ప్రాజెక్ట్ నుండి కియారా పేరు మాయమైంది. ఇక తాజాగా బాలీవుడ్ మూవీస్ తో సరిపెట్టుకుంటున్న ఈ భామ ఓ రేంజ్ లో అందాల ఆరబోతకు దిగింది.

మ్యాగజైన్ కోసం అందాల ఆరబోత

తానెంత గ్లామర్ గా సినిమాల్లో నటించగలనో అని ఈ హాట్ ఫోటో షూట్ తో చెప్పకనే చెప్పేసింది. ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్ కోసం కియారా అద్వానీ చేయించుకున్న ఈ హాట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. హాట్ లుక్ తో కియారా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్ మెయిన్ పేజీ మీద కియారా హాట్ ఫోటో చూసిన ఎవ్వరైనా.. అబ్బా కియారా కిర్రాక్ పుట్టించిందిగా అనకుండా మానరు. మరి ఈ రేంజ్ అందాలు ఆరబోస్తున్న కియారాకు బాలీవుడ్ తో పటు టాలీవుడ్ కూడా రెడ్ కార్పెట్ పరవక తప్పేలా కనబడడం లేదు. చూద్దాం ఈ అందాల ఆరబోత కియారకు ఏ మాత్రం హెల్ప్ చేస్తుందో అనేది.

Tags:    

Similar News