కైరా అద్వానీతో ముచ్చట్లు

Update: 2018-04-29 12:42 GMT

బాలీవుడ్ లో 'ధోని' సినిమా ద్వారా మనకి పరిచయం అయిన కైరా అద్వానీ తెలుగు సూపర్ స్టార్ మహేష్ పక్కన 'భరత్ అనే నేను' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సినిమాలో ఆమె నటనతో పాటు గ్లామర్ కూడా తోడవ్వడంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. మహేష్ బాబు కూడా ఆమె గురించి చాలా సందర్భాల్లో పొగిడాడు.

లేటెస్ట్ ఈ అమ్మడు కొన్ని ఆసక్తికర కబుర్లు చెప్పింది. కైరా తాతయ్య హమీద్ జాఫ్రీ, అలనాటి నటుడు సయీద్ జాఫ్రిీకి స్వయంగా తమ్ముడు కాగా, చిన్న అమ్మమ్మ ప్రముఖ హిందీ నటుడు అశోక్ కుమార్ పెద్ద కుమార్తె. ఆమె అసలు పేరు ఆలియా అద్వానీ అయితే తన మొదటి సినిమా 'పుగ్లీ' షూటింగ్ సమయంలో దాని నిర్మాత సల్మాన్ ఖాన్, పేరును కైరాగా మార్చాడు అని చెప్పుకొచ్చింది.

ఆమెకు తొమ్మది నెలల వయసులోనే విప్రో వ్యాపార ప్రకటనలో కనిపించింది. అప్పటినుండి ఆమె తరుచు కెమెరాలను ఫేస్ చేస్తూ ఉండటంతో ఆమెకు అదే ప్లస్ పాయింట్ అయిందని చెబుతోందీ. ఇక ఆమెకు వ్యాయామ పిచ్చి ఉందని, ఎక్సర్ సైజ్ చేయకుండా ఉండలేనని వెల్లడించింది. అలానే తెలుగులో తొలి చిత్రంతోనే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో నటించడం నమ్మలేకున్నానని అంటోంది ఈ అందాల ముద్దుగుమ్మ.

Similar News