కియారా బాయ్ ఫ్రెండ్ సిద్దార్దేనా?

బాలీవుడ్ లో కిర్రాక్ క్రేజ్ లో దూసుకుపోతున్న కియారా అద్వానీ గత ఏడాది బాలీవుడ్ లో రెండు భారీ హిట్స్ కొట్టింది. కబీర్ సింగ్ తో క్రేజ్ [more]

Update: 2020-01-05 06:12 GMT

బాలీవుడ్ లో కిర్రాక్ క్రేజ్ లో దూసుకుపోతున్న కియారా అద్వానీ గత ఏడాది బాలీవుడ్ లో రెండు భారీ హిట్స్ కొట్టింది. కబీర్ సింగ్ తో క్రేజ్ మాత్రమే కాదు.. కోట్లు కొల్లగొట్టి టాప్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. ఇక నిన్నగాక మొన్న విడుదలైన గుడ్ న్యూస్ తోనూ 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది కియారా. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియారా అద్వానీ నటించిన గుడ్ న్యూస్ సినిమా మంచి హిట్ అవడమే కాదు.. వారానికే 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టి టాప్ రేంజ్ హీరోయిన్స్ కి షాకిచ్చింది కియారా. అయితే న్యూ ఇయర్ కోసం కియారా అద్వానీ సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్లడం అక్కడ జంతువులను క్లోజప్లో ఫొటోస్ తీస్తో ఇంస్టా లో పోస్ట్ చెయ్యడం తో కియారా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ విషయాలకు ప్రపంచానికి తెలిసాయి.

అయితే కియారా సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్ళింది సింగిల్ గా కాదని బాయ్ ఫ్రెండ్ ని వెంటేసుకుని వెళ్లిందని టాక్ నడుస్తుంది. కియారా వెంట వచ్చిన బాయ్ ఫ్రెండ్ ఎవరంటూ చాలామంది కామెంట్స్ కూడా చేసారు. కియారా తో సౌత్ ఆఫ్రికా టూర్ కి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి వెళ్ళింది సిద్దార్థ్ మల్హోత్రా తో అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిద్దార్థ్ మల్హోత్రా కూడా సౌత్ ఆఫ్రికాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి వెళ్లిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేసేసరికి అందరూ కియారా అద్వానీ, సిద్దార్థ్ కలిసే సౌత్ ఆఫ్రికా వెళ్లారని, వీళ్లిద్దరు లవర్స్ అంటూ ప్రచారం మొదలెట్టాయి. మరా ప్రచారానికి తోడుగా కియారా, సిద్ధార్త్ లు కలిసి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చేసరికి.. కియారా.. కూడా వచ్చిన బాయ్ ఫ్రెండ్ సిద్దార్దేనా అంటూ అందరూ ఆటపట్టిస్తున్నారు.

Tags:    

Similar News