మహేష్ హీరోయిన్ కు భలే అదృష్టం పట్టుకుంది!

Update: 2018-08-04 06:52 GMT

బాలీవుడ్ లో ఆలా ఎంట్రీ ఇచ్చిందో లేదో జెట్ స్పీడ్ తో వరస అవకాశాలతో అటు హిందీలోను..ఇటు తెలుగులోనూ దూసుకుపోతుంది బాలీవుడ్ నటి కియరా అద్వాణీ. ఇలా వరస అవకాశాలతో బిజీగా ఉన్న ఈమెకు లేటెస్ట్ గా హిందీలో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఓ స్టార్ ప్రొడ్యూసర్ సినిమాలో.

కరణ్ జోహార్ సినిమాలో....

హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేకించి గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్ లాంటి ఫేమస్ నిర్మాత సినిమాలో కియరాకు ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆయన అక్షయ్ కుమార్ - కరీనాకపూర్ - దిల్జీత్ దోసాంజ్ వంటి క్రేజీ స్టార్స్ తో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి రాజ్ మెహతా దర్శకత్వం వహించనున్నారు.

రామ్ చరణ్ తో......

అయితే ఇటువంటి భారీ సినిమాలో కియరా అద్వాణీ అవకాశం రావడం బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎం.ఎస్.ధోని చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఒకేసారి స్టార్ హీరోస్ పక్కన చేయడం అంటే మాములు విషయం కాదంటున్నారు అక్కడ మీడియా వారు. ప్రస్తుతం ఆమె తెలుగులో బోయపాటి డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక కరణ్ జోహార్ సినిమాకు సంబంధించి అధికారిక కన్ఫర్మేషన్ ని కియరానే స్వయంగా అభిమానులకు షేర్ చేసింది.

Similar News