బాగానే రాటు తేలిందే

Update: 2018-07-01 04:27 GMT

బాలీవుడ్ నుండి టాలీవుడ్ కొచ్చిన కియారా అద్వానీ... రావడం రావడమే సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అమాయకపు అందాలతో.. ట్రెడిషనల్ లుక్ తో కియారా భరత్ అనే నేను సినిమాలో కనిపించింది. కొరటాల కియారా పాత్రకి పెద్దగా స్కోప్ ఇవ్వకపోయినా.. ఆమె అమాయకపు చూపులతో... ఆకర్షించే పెదాలతో.. అరమోడ్పు కన్నులతో యంగ్ సీఎం అయిన మహేష్ బాబు ని పడేసే పోలీసోడు కూతురిలా మిడిల్ క్లాస్ అమ్మాయిలా.. తండ్రి మాటను జవదాటని ఆడపిల్లగా బాగానే మెప్పించింది. మొదటి సినిమానే మహేష్ వంటి స్టార్ హీరో పక్కన నటించడంతో అమ్మడుకి లక్కు కలిసొచ్చింది. అందుకే భరత్ అనే నేను సినిమా విడుదల కాకముందే... చరణ్ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అబ్బా ఎంత లక్ అనుకున్నారు అంతా.

మరి రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో కియారా తెలియదు గాని.. అమ్మడు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ అయ్యింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందమైన ఫొటోస్ పెడుతూ అందరిని కవ్విస్తుంది. తాజాగా కియారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తుంటే మాత్రం... మంచి డిజైన్ వెర్ లో ఆకర్షణీయమైన లుక్ తో చంపేస్తుంది. మరి కియారా అద్వానీని అలా చూసిన ఎవ్వరైనా హీరోయిన్ గా ఇలా అందాలను, గ్లామర్ చూపించడానికి బాగా రాటు దేలిందే అనిపిస్తుంది. మెడ అందాలతో... పెద్ద నేక్లెస్ పెట్టుకుని క్లివేజ్ అందాలతో... వయ్యారంగా చూస్తున్న కియరా కుర్రకారు గుండెల్లో చిచ్చు రేపుతోంది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ పక్కన నటిస్తున్న కియారా మరికొన్ని ఆఫర్స్ ని ముందుపెట్టుకుని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరి మీరు కియారా అందమైన ఫోటో చూసి ఆస్వాదించండి.

Similar News