ఇలా అయితే కేజీఎఫ్ కి కష్టమే..!

Update: 2018-12-21 07:03 GMT

ఈ రోజు రెండు తెలుగు సినిమాలతో పాటు రెండు పరభాషా చిత్రాలు కూడా విడుదల అవుతున్నాయి. తెలుగు సినిమాలకు పోటీగా విడుదల చేస్తున్న తమిళ మూవీ మారి 2, కన్నడ మూవీ కేజీఎఫ్ సినిమాలు కూడా ఆయా భాషల్లో భారీగా తెరకెక్కిన సినిమాలే. తెలుగులో పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాయి. ఇక మారి 2 కూడా తమిళంలో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తెలుగు సినిమాలు రెండూ భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని వారిని థియేటర్స్ బాట పట్టిస్తున్నాయి. ఇక తమిళ మారి 2కి తెలుగులో అంతంతమాత్రం ప్రమోషన్స్ చేశారు ఆ సినిమా హాక్కులను కొన్న నిర్మాతలు. అయితే హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ తో సినిమా ఆడుతుందని నిర్మాతల నమ్మకం. ఇక మొదటి నుండి భారీ అంచనాలు ఉన్న కేజీఎఫ్ సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. యష్ హీరోగా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళం, కన్నడంలో విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.

తెలుగు సినిమాల జోరులో...

తమిళనాట కేజీఎఫ్ కి విశాల్ వెన్నుదన్నుగా నిలిస్తే.. తెలుగులో సాయి కొర్రపాటి ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు. ఇక మొదట్లో కేజీఎఫ్ ప్రమోషన్స్ కి రాజమౌళిని పిలిచారు. రాజమౌళి కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పాడు. అయితే ఈ సినిమా విడుదల ఈ రోజు అన్నది సరే కానీ.. ఎక్కడా సినిమా ప్రమోషన్ లెదు. తెలుగు సినిమాలతో పోలిస్తే కేజీఎఫ్ ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. కన్నడలో భారీగా తెరకెక్కిన ఈ సినిమాకి మౌత్ టాక్ సరిపోతుందిలే అనుకున్నట్టుగా ఉంది నిర్మాతల తీరు. అందుకే ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్ లను గ్రాండ్ గా జరిపేసి... మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్ ని గాలికి వదిలేశారు. పడి పడి లేచే మనసు, అంతరిక్షం పోటాపోటీగా ప్రమోషన్స్ లో జోరు చూపిస్తే కేజీఎఫ్ ని కొన్న సాయి కొర్రపాటి మాత్రం చాలా లైట్ తీసుకున్నాడు. కనీసం హీరో ఇంటర్వ్యూ కానీ, హీరోయిన్ ఇంటర్వ్యూ కానీ లెదు. ఇలాగైతే తెలుగు సినిమాల జోరులో కేజీఎఫ్ కొట్టుకుపోయే అవకాశాలు కనబడుతున్నాయి.

Similar News