ఛాప్టర్ 2 కోసం వెయిటింగ్ ఇక్కడ..!

కన్నడలో ఎటువంటి హడావిడి లేకుండా భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కెజిఎఫ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అదిరిపోయే కలెక్షన్స్ [more]

Update: 2019-01-05 07:42 GMT

కన్నడలో ఎటువంటి హడావిడి లేకుండా భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కెజిఎఫ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొట్టింది. డ్రైవర్ కొడుకు యశ్ కెజిఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ గా పేరు ప్రతిష్టలు సంపాదించాడు. కెజిఎఫ్ కన్నడలో సోలోగా రిలీజైనా, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఐదారు సినిమాల మీద పోటీ పడింది. అయితే తెలుగులో పడి పడి లేచే మనసు, అంతరిక్షం యావరేజ్ తో సరిపెట్టుకోవడం, తమిళనాట మారి 2 ఫ్లాప్ కావడం, హిందీలో జీరో జీరో అవడంతో కెజిఎఫ్ హిట్ అయ్యి కూర్చుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ బాక్సాఫీసు వద్ద హడావిడి చేసింది. అయితే ప్రశాంత్ నీల్ ఈ కెజిఎఫ్ ని చాప్టర్ 1, 2 లుగా విడుదల ప్లాన్ చేసి కెజిఎఫ్ చాప్టర్ 1ని డిసెంబర్ 21న పలు సినిమాల మీదకి పోటీకి దింపాడు.

భారీగా పెరిగిన అంచనాలు

అయితే కెజిఎఫ్ చాప్టర్ 1 హిట్ కావడంతో.. ఇప్పుడు పలు భాషల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ దృష్టి కెజిఎఫ్ చాప్టర్ 2 మీద పడింది. అయితే దర్శకుడు చాప్టర్ 1 అండ్ 2లను ఒకేసారి షూట్ చేసి రెడీ చేసాడు. మొదటి పార్ట్ ని భారీ సినిమాల మీదకి పోటీకి దింపినా… సెకండ్ పార్ట్ ని మాత్రం సోలో రిలీజ్ ప్లాన్ చేశారట. అయితే చాప్టర్ 1 హిట్ కావడంతో.. ఇప్పుడు ప్రేక్షకుల్లోనూ చాప్టర్ 2 మీద ఆసక్తి పెరిగిపోయింది. చాప్టర్ 1 కన్నా సినిమా కథ మొత్తం చాప్టర్ 2లోనే ఉండబోతుందట. రాఖీ బాయ్ గరుడను చంపాక ఆ బంగారు గనులను స్వాధీనం చేసుకుని ఏం చేసాడు, దానిపైనే కన్నేసిన ఇతర ప్రత్యర్థులను ఎలా కట్టడి చేసాడు, ప్రధానమంత్రి తనను చంపమని వారంట్ ఇష్యూ చేసే స్థాయికి ఎలా చేరుకున్నాడు ఇలాంటి ప్రశ్నలకు సమాదానాలన్నీ కెజిఎఫ్ చాప్టర్ 2లోనే ఉండబోతున్నాయి.

పూర్తయిన షూటింగ్

అందుకే ఇప్పుడు కెజిఎఫ్ చాప్టర్ 2 మీద బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇక చాప్టర్ 1కి ఇతర భాషల్లో సో సో బిజినెస్ జరిగితే. ఇప్పుడు చాప్టర్ 2కి మాత్రం బాగా డిమాండ్ అంటే దాదాపు కెజిఎఫ్ చాప్టర్ 1 కన్నా మూడింతల డిమాండ్ పెరిగిందట. కాకపోతే కెజిఎఫ్ నిర్మాతలు టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. అయితే చాప్టర్ 1తో పాటుగా చాప్టర్ 2ని కూడా చిత్రీకరించిన ప్రశాంత్ నీల్ ఆ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసాడంటున్నారు. ఇక చాప్టర్ 2లో ఎటువంటి షూటింగ్ బ్యాలెన్స్ లేదని, అందుకే యశ్ కూడా తన తదుపరి సినిమా కోసం రెడీ అవడమే కాదు…. కెజిఎస్ కోసం పెంచిన గెడ్డం తీసేశాడని అంటున్నారు. మరి కెజిఎఫ్ చాప్టర్ 1తో సంచలనాలు సృష్టించిన యశ్ – ప్రశాంత్ లు కెజిఎఫ్ 2తో మరెన్ని రికార్డులు కొల్లగొడతారో చూడాలి.

Tags:    

Similar News