ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ‘కేజీఎఫ్’ హవా..!

Update: 2018-12-24 07:53 GMT

ఈ క్రిస్మస్ సెలవులకి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు స్ట్రెయిట్ సినిమాలు అయితే.. రెండు డబ్బింగ్ చిత్రాలు. తెలుగు వారంతా హోప్స్ పెట్టుకుంది ‘పడి పడి లేచె మనసు’, ‘అంతరిక్షం’ సినిమాల పైనే. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. క్రేజీ కాంబినేషన్స్ తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు విడుదలకి ముందు ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. కానీ ఇవి రెండూ అంచనాల్ని అందుకోలేకపోయాయి. వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ కొద్దిగా పర్లేదు అనిపించుకున్నా శర్వా ‘పడి పడి లేచె మనసు’ బాగా నిరాశ పరిచింది.

ఆ రెండు సినిమాలే హౌజ్ ఫుల్...

అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అదే రోజు రిలీజ్ అయిన 'మారి 2', ‘కేజీఎఫ్’ పరిస్థితి కొంచెం బాగానే ఉంది. 'మారి 2 ' బిలో యావరేజ్ గా నిలవగా ‘కేజీఎఫ్’ కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఇందులో హీరో ఎలివేషన్లు.. మాస్ అంశాలు ఆ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి. ఈ ఆదివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క ‘కేజీఎఫ్’కు మాత్రమే హౌస్ ఫుల్ పడింది అంటే దీని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీ, సీ సెంటర్స్ కి ఈ మూవీ విపరీతంగా నచ్చుతుంది. దీనితో పాటు అంతకు ముందు వారం రిలీజ్ అయిన చిన్న సినిమా ‘హుషారు’కు హౌస్ ఫుల్ బోర్డు పడటం విశేషం. ఈ చిత్రానికి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

Similar News