మహానటితో మధురవాణి

Update: 2018-05-07 05:17 GMT

మహానటి సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది. మహానటి సినిమా ప్రమోషన్స్ లో మహానటి టీమ్ చాలా బిజీగా వుంది. సావిత్రి జీవిత కథను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. కీర్తి సురేష్ మహానటి గా సావిత్రి పాత్రలో ఇరగదీస్తోంది. సావిత్రి పోలికలతో కట్టుబొట్టుతో కీర్తి లుక్ అచ్చం సావిత్రి లుక్ ని పోలి ఉండడమే ఈ సినిమా కి మెయిన్ ఎస్సెట్. ఇక మరో మెయిన్ ఎస్సెట్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మధురవాణిగా నటించడం. భారీ స్టార్ కాస్ట్ తో నిండిన మహానటి మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం మహానటి ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్ సింగిల్ ఇంటర్వూస్ ఇస్తుంటే... ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ కి తోడు మధురవాణి ఉరఫ్ సమంత కూడా తోడైంది. ప్రస్తుతం రంగస్థలం హిట్ ఫుల్ జోష్ లో ఉన్న రామలక్ష్మి ఉరఫ్ సమంత మహానటి ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అందులో భాగంగానే కీర్తి సురేష్, సమంత లు తీసుకున్న ఒక సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఆ సెల్ఫీని చూస్తుంటే మాత్రం మహానటితో మధురవాణి బహు బావుంది కదా అని అనిపించక మానదు. చక్కని నవ్వుతో కీర్తి సురేష్, అదే నవ్వుతో సమంత చూడడానికి ముచ్చటగా ఉన్నారు. మరి మీరు ఆ సెల్ఫీని ఓ లుక్కేయండి.

ఇక బుధవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహానటిపై కీర్తి సురేష్ భారీ ఆశలే పెట్టుకుంది. ఇక సమంత కి మహానటి విడుదలైన మూడు రోజులకే కోలీవుడ్ లో విశాల్ తో జోడి కట్టిన అభిమన్యుడు సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందు రానుంది.

Similar News