సన్నగా అయ్యి.. ఛాన్స్ వదిలేసుకుందా?

మహానటి తో బాగా లావుగా తయారైన కీర్తి సురేష్ కి ఆమె బరువు కారణంగా ఓ ఏడాది పాటు సినిమా ఛాన్సెస్ రాలేదు. అయితే కీర్తి సురేష్ [more]

Update: 2020-01-18 05:12 GMT

మహానటి తో బాగా లావుగా తయారైన కీర్తి సురేష్ కి ఆమె బరువు కారణంగా ఓ ఏడాది పాటు సినిమా ఛాన్సెస్ రాలేదు. అయితే కీర్తి సురేష్ మళ్ళి బాగా వర్కౌట్స్ గట్ర చేసి సన్నగా నాజూగ్గా తయారైంది. ఈమధ్యన కీర్తి సురేష్ హాజరవుతున్న ఈవెంట్స్ లో ఆమె ఎంతగా నాజూగ్గా తయారయ్యిందో తెలుస్తుంది. అయితే సన్నగా మారాక కీర్తి సురేష్ చేతినిండా సినిమాలే. తెలుగు తమిళమే కాదు.. బాలీవుడ్ లో మైదాన్ సినిమాతో అక్కడ ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగులో మిస్ ఇండియా తోనూ బిజీ అయినా కీర్తి సురేష్ మహానటి తో ఈమధ్యనే నేషనల్ అవార్డు అందుకుంది. ఇక్కపోతే బాలీవుడ్ మైదాన్ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఫీలయిన కీర్తి సురేష్.. ఆ సినిమా కి సైన్ చేసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యింది. ఎవరికీ తెలియని కథలో నటిస్తూ బాలీవుడ్ కి పరిచయమవుతున్నందుకు ఆమె సంతోషపడింది.

అయితే తాజాగా కీర్తి సురేష్ బాలీవుడ్ మైదాన్ సినిమా నుండి తప్పుకున్నట్టుగా న్యూస్. సయ్యద్ రహీం అనే ఫుడ్ బాల్ ఆటగాడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మైదాన్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాత బోని కపూర్ తో కీర్తి సురేష్ మాట్లాడి ఈ సినిమా నుండి బయటికొచ్చేసిందంటున్నారు. అయితే దానికి కారణంగా కీర్తి సురేష్ బాగా సన్నగా చిన్న పిల్లలా కనబడంతో. అజయ్ సరసన తేలిపోవడంతో.. ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్. అజయ్ దేవగన్ భార్య పాత్రలో కీర్తి చాలా తక్కువ వయసు ఉన్న అమ్మాయిగా కనబడడంతో.. కీర్తి సురేష్ కి అంతగా నచ్చకపోవడంతో.. ఈ సినిమా నుండి తానే తప్పుకుంటున్నట్లుగా బోణీ కపూర్ కి చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్.

Tags:    

Similar News