దర్శకధీరుడి చేతికి మహానటి

Update: 2018-05-16 03:46 GMT

అజ్ఞాతవాసి తో పోయిన క్రేజ్ కాస్తా.. మహానటితో మళ్ళీ తెచ్చేసుకుంది కీర్తి సురేష్. అజ్ఞాతవాసి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ కష్టాల్లో పడింది.. ఇక అమ్మడు అన్ని సర్దుకుని సినిమాలను వదిలెయ్యడమే.. అంతలావున్న హీరోయిన్ ని ఎవరైనా పిలిచి అవకాశమిస్తారా.. అంటూ అనేకరకాల ప్రచారాలు సోషల్ మీడియా సాక్షిగా హల్చల్ చేశాయి. అయితే ఆ గాసిప్స్ కి మహానటి తో కీర్తి సురేష్ చెక్ పెట్టింది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో మెరిసిన కీర్తి సావిత్రి పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. అచ్చం సావిత్రి పోలికలతో.. ఉండడమే కాదు.. సావిత్రి లా నటించి అందరి మనసులను కొల్లగొట్టింది.

అయితే ఇప్పుడు ఆ భామ మీద దర్శకధీరుడు చూపు పడినట్లుగా చెబుతున్నారు. రాజమౌళి మహానటి సినిమాని చూసి నాగ్ అశ్విన్ ని ఎంతగా ప్రశంసించాడో... కీర్తి సురేష్ ని అంతే పొగిడేసాడు. అయితే రాజమౌళి అక్కడితో ఆగకుండా తన మల్టీస్టారర్ లో కీర్తి సురేష్ కి ఒకమంచి ఆఫర్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి చెయ్యబోయే మల్టి స్టారర్ కోసం కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నట్లుగా ప్రచారం మొదలైంది. మహానటి తో తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేష్ స్థాయిని అమాంతంగా పెరగడం తన మల్టీస్టారర్ కి పనికొస్తుంది కాబట్టే.. రాజమౌళి కీర్తి ని తన మల్టీస్టారర్ లో నటింపజేసే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం.

ఇప్పటివరకు చెర్రీ కి ఎన్టీఆర్ కి హీరోయిన్ ని సెట్ చెయ్యని రాజమౌళి... మహానటి తో క్రేజ్ కొట్టేసిన కీర్తి సురేష్ ని చరణ్ కోసమో.. ఎన్టీఆర్ కోసం సెలెక్ట్ చేస్తాడో... తెలియదు గాని.... ఇదేగనక నిజమైతే కీర్తి కి టాలీవుడ్ లో ఇక తిరుగుండదు. రాజమౌళి సినిమాలో హీరోయిన్ అంటే కీర్తి కి అదృష్టం వరించినట్లే. చూద్దాం ఫైనల్ గా రాజమౌళి హీరోయిన్స్ లిస్ట్ లో కీర్తి సురేష్ ఉంటుందో లేదో..!

Similar News