‘మన్మథుడు 2’ లో కీర్తి పాత్ర ఏంటో తెలుసా?

దాదాపు 19 ఏళ్ళ తరువాత కింగ్ నాగార్జున మన్మథుడు సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. దీనికి ‘మన్మథుడు 2’ అని టైటిల్ పెట్టారు. మన్మథుడు ని విజయ్ భాస్కర్ [more]

Update: 2019-06-05 08:33 GMT

దాదాపు 19 ఏళ్ళ తరువాత కింగ్ నాగార్జున మన్మథుడు సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. దీనికి ‘మన్మథుడు 2’ అని టైటిల్ పెట్టారు. మన్మథుడు ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తే ఇప్పుడు ‘మన్మథుడు 2’ ని హీరో కం డైరెక్టర్ రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరో ముఖ్య పాత్రలో కథను మలుపుతిప్పే పాత్రలో అక్కినేని సమంత నటిస్తుంది. అలానే కీర్తి సురేష్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఇది అధికారంగా కంఫర్మ్ చేసారు మేకర్స్. నాగార్జునతో కీర్తి సురేష్‌ ఉన్న ఫోటోను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఇందులో కీర్తి నాగార్జున ప్రియురాలి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి నాగ్ ‘మన్మథుడు 2’ హీరోయిన్ స్టార్ కాస్టింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అయినట్టు కనబడటం లేదు. ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఒకే సినిమాలో నటించడంతో దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Tags:    

Similar News