షాకింగ్: కీర్తి… రజినీ చెల్లిగానా

మహానటి కీర్తి సురేష్ ఓ ఏడాది గ్యాప్ తో ఇప్పుడు ఫుల్ ఫామ్ లో కొచ్చేసింది. తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ క్రేజీ హీరోయిన్ [more]

Update: 2019-12-22 04:16 GMT

మహానటి కీర్తి సురేష్ ఓ ఏడాది గ్యాప్ తో ఇప్పుడు ఫుల్ ఫామ్ లో కొచ్చేసింది. తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ క్రేజీ హీరోయిన్ కి రజినీకాంత్ సినిమా ఆఫర్ రావడంతో మణిరత్నం సినిమాని కూడా వదిలేసుకుంది. రజినీకాంత్ గారితో పనిచేయడం తన అదృష్టం అంటూ తెగ ఇదైపోయింది కూడా. అయితే కీర్తి సురేష్ అంతలా మురిపోవడం చూసి రజినీకాంత్ కి కీర్తి సురేష్ హీరోయినా? లేదా మరేదన్నా పాత్ర అంటూ చాల ఊహాగానాలు సోషల్ మీడియాలో నడిచాయి. ఇక కీర్తి సురేష్, రజినీకాంత్ కూతురుగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుందని అన్నారు.

చెల్లెలి పాత్రలో….

కానీ తాజాగా బయటికొచ్చిన షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనబడబోతుంది అని… రజినికాంత్ తల్లి తండ్రులకు లేటుగా పుట్టిన అమ్మాయిగా.. కీర్తి రోల్ ఉంటుందని ఆ వదంతి సారాంశం. మరి తెలుగు, తమిళ, హిందీ ఆఫర్స్ తో సూపర్ ఫార్మ్ లో ఉన్న కీర్తి సురేష్ ఇలా రజిని చెల్లిగా నటిస్తునందుకా అంతగా పొంగిపోతుంది అంటూ పెదవి విరుస్తున్నారు. ఇక మరోపక్క రజినీకాంత్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.. చిన్న రజినీకాంత్ హీరోయిన్ గా కీర్తి సురేష్ అంటూ మరొక న్యూస్ వెలుగులోకొచ్చింది. మరి కీర్తి సురేష్ రజినీకాంత్ కి చెల్లెలా, లేక హీరోయిన్ అనేది కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న గాసిప్. అందులో ఎంతనిజముందో క్లారిటీ లేదు.

Tags:    

Similar News