జయలలితగా నేనా?.. అంటున్న నటి

Update: 2018-08-26 05:40 GMT

తమిళనాట నట జీవితంలో హీరోయిన్ గా... పొలిటికల్ కెరీర్ లో ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన జయలలిత జీవితాన్ని బయో పిక్ గా నిర్మించేందుకు సన్నాహాలు మొదలైనాయి. జయలలిత వ్యక్తిగత జీవితం కానీ. రాజకీయ జీవితం కానీ.. పూల పానుపు కాదు.. ఆ దారిలో అనేక ముళ్ళు అంటే అనేక సవాళ్ళను ఎదుర్కొని జయలలిత 2016 డిసెంబర్ లో అర్దాంతరంగా అనారోగ్య సమస్యలతో కన్ను మూసింది. అప్పటినుండి అమ్మ బయో పిక్ అంటూ ప్రచారం జరిగిన ఇన్నాళ్ళకి ఇప్పుడు జయలలిత బయో పిక్ పట్టాలెక్కబోతుంది. అయితే తమిళనాట అమ్మ జయలలిత బయో పిక్ ని ఇద్దరు దర్శకులు రెండు సినిమాలుగా చెయ్యబోతున్నారు. విజయ్ డైరెక్షన్ లో ఒక బయో పిక్, భారతి రాజా డైరెక్షన్ లో మరో బయో పిక్ ని ఎవరి వెర్షన్ లో వారు తెరకెక్కించబోతున్నారు.

అయితే జయలలిత పాత్ర చేసే హీరోయిన్ విషయంలో అనేకరకాల హీరోయిన్స్ పేర్లు వినబడుతున్నాయి. అందులో మొదటగా మహానటి కీర్తి సురేష్ పేరు జయలలిత పాత్రలో జయలలిత బయో పిక్ లో నటించనుందని న్యూస్ హైలెట్ అయ్యింది. తర్వాత నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాయ్, విద్య బాలన్ పేర్లు వినబడుతున్నాయి. అయితే మహానటి తో మంచి పేరు కొట్టేసిన కీర్తి సురేష్ జయలలిత పాత్రకు సెట్ అవుతుందని.. సావిత్రిగా అదరగొట్టిన కీర్తి సురేష్ అమ్మ పాత్రలో ఒదిగిపోతుంది అన్నారు. అయితే తాజాగా ఆ అన్యూస్ మీద నటి కీర్తి సురేష్ స్పందించింది.

జయలలిత బయో పిక్ లో జయలలిత పాత్రను గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదని..... జయలలితగారు చాలా గొప్పనటి .. అంతకు మించిన గొప్ప నాయకురాలు. అలాంటి జయలలిత గారిలా నటించడం అంత తేలికైన విషయం కాదు .. అంత ధైర్యం కూడా నాకు లేదు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. మరి అద్భుతమైన సావిత్రి లాంటి పాత్రనే ఛాలెంజింగ్ గ అలవోకగా నటించి అందరి మన్ననలు పొందిన కీర్తి సురేష్ కి జయలలిత పాత్ర చెయ్యడం పెద్ద విషయం కానప్పటికీ... కీర్తి అలా చెప్పడం మాత్రం బావుంది. అంత పెద్ద నటి, పొలిటీషియన్ అయిన జయలలిత పాత్ర చెయ్యడం అనేది కాస్త రిస్క్ చెయ్యడమే. మరి అలాంటి పాత్రకు ఏ హీరోయిన్ సెట్ అవుతుందో చూడాలి.

Similar News