ఈ విధంగా చేస్తే స్లిమ్ అవక ఏం అవుతారు!!

హీరోయిన్స్ ఎవరైనా అందంగా ఆకర్షణగా కనిపించాలి అంటే.. మంచి ఫిట్ నెస్ అలాగే ఆరోగ్యకరమైన డైట్ తో కుస్తీలు పడతారు. స్లిమ్ గా ఉంది.. బికినీ షోలకు [more]

Update: 2020-08-29 08:42 GMT

హీరోయిన్స్ ఎవరైనా అందంగా ఆకర్షణగా కనిపించాలి అంటే.. మంచి ఫిట్ నెస్ అలాగే ఆరోగ్యకరమైన డైట్ తో కుస్తీలు పడతారు. స్లిమ్ గా ఉంది.. బికినీ షోలకు అనువుగా ఉంటేనే కెరీర్ కొన్నాళ్ళు నిలబెట్టుకునేలా ఉంది ఈ కాలం. అందుకే హీరోయిన్స్ జిమ్ లు యోగాలు అంటూ ఒళ్ళుకరిగించుకుంటారు. అయితే ఒకప్పుడు కాస్త బొద్దుగా ముద్దుగా ట్రెడిషనల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తాను నటించిన మహానటి సావిత్రి బయోపిక్ కోసం కొంచెం ఎక్కువగానే బరువు పెరిగింది. అయితే ఆ బరువు వలన కీర్తి సురేష్ రెండేళ్లు కెరీర్ లో సినిమాల నుండి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత బాగా చిక్కి గ్లామర్ గా, సన్నగా మారింది. దెబ్బకి స్టార్ హీరోల అవకాశాలు పరిగెత్తుకొచ్చాయి. అయినా కీర్తి సురేష్ బరువు ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ఓ టార్గెట్ పెట్టుకుని మరీ బరువుని అదుపులో ఉంచుకుంది.

ఫిట్ నెస్ కోసం కీర్తి సురేష్ రోజు ఏకంగా యోగాలో 150 సార్లు సూర్య నమస్కారాలు చేస్తుంది. ప్రస్తుతం రోజుకి 150 సార్లు నమస్కారాలు చేస్తున్న కీర్తి సురేష్ ఆ సూర్య నమస్కారాలు సంఖ్యని 200 సార్లు పెంచాలంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ సూర్య నమస్కారాలు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి 200 సార్లు సూర్య నమస్కారాలంటే కీర్తి సురేష్ మరింత స్లిమ్ గా పూర్తికి ఫిట్ నెస్ తో అందంగా కనిపించడం ఖాయం. మరి మహానటి తర్వాత కీర్తి సురేష్ కెరీర్ అయ్యిపోయింది అనుకుంటే.. ఇప్పుడు బరువు తగ్గి అందంగా తయారయ్యాక.. మళ్ళీ స్టార్ హీరోల అవకాశాలు కీర్తి సురేష్ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పటికే సౌత్ లో మహేష్ తో సర్కారు వారి పాటలో ఛాన్స్ దక్కించుకున్న కీర్తి సురేష్.. ప్రభాస్ ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీ లో సీత పాత్రకి హీరోయిన్స్ లిస్ట్ లో పరిశీలనలో ఉన్నట్లుగా టాక్ ఉంది.

Tags:    

Similar News