కీర్తి సురేష్ దుబాయ్ ఎంజాయ్మెంట్!

రంగ్ దే టీం వెంకీ అట్లూరి – నితిన్ – కీర్తి సురేష్ లు ఇప్పుడు దుబాయ్ లో షూటింగ్ చేసుకుంటున్నారు. కరోనా వలన ఆగిన దుబాయ్ [more]

Update: 2020-11-30 07:37 GMT

రంగ్ దే టీం వెంకీ అట్లూరి – నితిన్ – కీర్తి సురేష్ లు ఇప్పుడు దుబాయ్ లో షూటింగ్ చేసుకుంటున్నారు. కరోనా వలన ఆగిన దుబాయ్ షెడ్యూల్ ని తాజాగా గా ప్లాన్ చేసిన వెంకీ అట్లూరి.. అక్కడ దుబాయ్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నాడు. మరి రంగ్ దే టీం కేవలం షూటింగ్ కొసం మాత్రమే దుబాయ్ వెళ్ళలేదు. కరోనా తో ఇంట్లోనే ఉండి బోర్ కట్టిన నితిన్ తన వైఫ్ తో దుబాయ్ లో సైట్ సీయింగ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో షాలిని ని పెళ్లాడిన నితిన్ హాని మూన్ కోసం ఎక్కడికి వెళ్లలేకపోయాడు కారణం కరోనా. అందుకే దుబాయ్ లో రంగ్ దే షూటిగ్ తో పాటుగా నితిన్ భార్యతో హానిమూన్ కూడా చేసుకుంటున్నాడు.

మరి నితిన్ మాత్రమే భార్య తో ఎంజాయ్ చేస్తాడా.. నేను మాత్రం తక్కువా అన్నట్టుగా కీర్తి సురేష్ తన గ్యాంగ్ తో దుబాయ్ లో హడావిడి చేస్తుంది. రంగ్ దే షూటింగ్ స్పాట్ లో అలసటగా సేద తీరుతున్న కీర్తి సురేష్ పిక్ ని పోస్ట్ చేసాడు నితిన్. ఇక తాజాగా కీర్తి సురేష్ రంగ్ దే షూటింగ్ తో పాటుగా తన ఫ్రెండ్ సర్కిల్స్ తో దుబాయ్ లో ఎంజాయ్ చేస్తుంది. కీర్తి అండ్ గ్యాంగ్ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ ఫొటోస్ చూస్తుంటే నితిన్ భార్యతో దుబాయ్ లో తిరుగుతుంటే.. కీర్తి కూడా గ్యాంగ్ నేసుకుని దుబాయ్ చుట్టేసింది అనిపిస్తుంది కదా.

Tags:    

Similar News