కీర్తి కి ఆ విషయంలో క్లారిటీ లేదా?

అజ్ఞాతవాసి తర్వాత మహానటి తో కీర్తి సురేష్ ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది. మహానటి క్రేజ్ అంతా ఇంతా కాదు…  ఆ మైకంలోనే కీర్తి సురేష్ కథ గురించి, [more]

Update: 2020-11-09 04:52 GMT

అజ్ఞాతవాసి తర్వాత మహానటి తో కీర్తి సురేష్ ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది. మహానటి క్రేజ్ అంతా ఇంతా కాదు…  ఆ మైకంలోనే కీర్తి సురేష్ కథ గురించి, కేరెక్టర్ గురించి ఆలోచించకుండా తన పాత్రకి ప్రాధాన్యం లేని స్టార్ హీరోల సినిమాలు చేసి చేతులు కాల్చుకుంది. ఇక మహానటితో తనకి వచ్చిన క్రేజ్ తో లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా మరింది. అందుకే అటు పెంగ్విన్, ఇటు మిస్ ఇండియా, మరో వైపు గుడ్ లాక్ సఖి సినిమాలు ఒప్పుకుంది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ నయనతార స్టార్ హీరోలే కాదు… చిన్న హీరోల సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. ఎదుకంటే నయనతార చేసిన ఏ సినిమా అయినా కంటెంట్ పరంగాను, తన కేరక్టర్ పరంగాను కీలకంగా ఉన్నాయి కాబట్టి.

ఇక అనుష్క కూడా అరుంధతి తర్వాత చాలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అవకాశాలు వచ్చినా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుని గ్లామర్ షో చేస్తూ స్టార్ హీరోల ఛాన్సెస్ కొట్టేసింది. కానీ కీర్తి సురేష్ మహానటి దెబ్బకి తన మీద తనకి బాగా నమ్మకం పెరిగిపోయి వరసగా లేడి ఓరియెంటెడ్ మూవీస్ ఒప్పేసుకుని పప్పులో కాలేసింది. మరి ఇప్పటికైనా కీర్తి సురేష్ అటు గ్లామర్ ఇటు కమర్షియల్ మూవీస్ ఒప్పుకుంటే బెటర్. కానీ ట్రెడిషనల్ గాను, పద్దతిగా కాకుండా గ్లామర్ కి ఓకె చెప్పాలి.. ఇక ఓ పాత్ర కోసం సన్నగా మారిన కీర్తి లుక్స్ పై వస్తున్న విమర్శలకు కీర్తి సురేష్ చెక్ పెట్టింది. తాను మళ్ళి బరువు పెరగబోతున్నట్లుగా కూడా చెప్పింది.

Tags:    

Similar News