బాబు పుట్టిన‌రోజుకు కేసీఆర్ పాట‌..!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి వివాదానికి తెర‌లేపారు. టైగ‌ర్ కేసీఆర్ పేరుతో కేసీఆర్ బ‌యోపిక్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న ఇవాళ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు [more]

Update: 2019-04-20 06:55 GMT

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి వివాదానికి తెర‌లేపారు. టైగ‌ర్ కేసీఆర్ పేరుతో కేసీఆర్ బ‌యోపిక్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న ఇవాళ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అంటూ ఈ చిత్రంలో ఉండ‌నున్న ఓ పాట పాడి వినిపించారు. ఆర్జీవీ పాడిన ఈ పాట‌లో వివాదాస్ప‌ద లిరిక్స్ ఉన్నాయి. దీంతో సొష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విభ‌జ‌న త‌ర్వాత ప్ర‌శాంతంగా ఉంటున్న రెండు రాష్ట్రాల మ‌ధ్య వ‌ర్మ చిచ్చుపెడుతున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వీటిపైన కూడా వ‌ర్మ స్పందించారు. తాను ఆంధ్రుల‌ను విల‌న్లుగా చూపించ‌డం లేద‌ని..కోట్లాది ఆంధ్రుల‌కు వెన్నుపోటు పొడిచి రాష్ట్ర విభ‌జ‌న ప‌రిస్థితుల‌ను తీసుకువ‌చ్చిన కొంద‌రు ఆంధ్రుల‌ను మాత్ర‌మే చూపిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సినిమాలో కేసీఆర్‌, కేటీఆర్, క‌విత‌, హ‌రీష్ రావు, వైఎస్సార్‌, జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి, రామోజీరావు, నారా లోకేష్ పాత్ర‌లు ఉంటాయ‌న్నారు.
http://

https://platform.twitter.com/widgets.js

 

Tags:    

Similar News