కేసీఆర్ బయోపిక్ టైటిల్, నటుల వివరాలు...

Update: 2018-06-28 07:51 GMT

మహానటి సినిమాతో టాలీవుడ్ లో బయోపిక్ ల హవా ప్రారంభమైంది. ప్రస్థుతం ఎన్టీఆర్ బయోపిక్, యాత్రా పేరుతో వైఎస్సార్ బయోపిక్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు కూడా తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ గురువారం ప్రారంభమైంది. కల్వకుంట్ల నాగేశ్వర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో సీనియర్ నటుడు నాజర్ నటిస్తున్నారు. ఉద్యమ సారథిగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉద్యమ సింహం’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసిన నవంబర్ 29 నే ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Similar News