‘కవచం’ హిందీలో కుమ్మేస్తుంది..!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘కవచం’ సినిమా గత ఏడాది చివర్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద [more]

Update: 2019-04-30 07:32 GMT

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘కవచం’ సినిమా గత ఏడాది చివర్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ‘ఇన్స్ పెక్టర్ విజయ్’ అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా మంచి వ్యూస్ ను రాబడుతుంది. ఈ డబ్బింగ్ చిత్రం విడుదలైన 24 గంటల్లో 16 మిలియన్ల వ్యూస్ ను రాబట్టడం విశేషం. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మెహ్రీన్ మరో కథానాయికగా నటించింది.

మళ్లీ అదే కాంబోలో సీత..!

అలానే తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేష్ విలన్ పాత్రలో నటించాడు. ఇప్పుడు మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ కాంబినేషన్ లో ‘సీత’ అనే సినిమా రాబోతుంది. దీన్ని తేజ డైరెక్ట్ చేసాడు. కెరీర్ పరంగా శ్రీనివాస్ కి చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. కాబట్టి ‘సీత’ సినిమాతో అయినా శ్రీనివాస్ హిట్ అందుకుంటాడేమో చూద్దాం. మే నెల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశముంది.

Tags:    

Similar News