కౌశల్.. ఎందుకు ఈ సెల్ఫ్ డబ్బా..?

Update: 2018-10-11 06:53 GMT

తన మాటలతో మాయ చేసి.. నేను ఒంటరి అనే ఫీలింగ్ తెచ్చి కౌశల్ ఆర్మీ పేరుతో బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడు కౌశల్. సినిమాలో అవకాశాల కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. రీసెంట్ గా అతను ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బిగ్ బాస్ టైటిల్ గెలిచాక తనకో యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తామని సమాచారం ఇచ్చిందని..వాటికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చెబుతున్నాడు.

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోనా..?

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ...మరోసారి అటువంటి మాటలే మాట్లాడాడు కౌశల్. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆఫీస్ నుంచి కూడా తనకు కాల్ వచ్చిందని, షూటింగ్ లో ఉండటం వల్ల నాన్న లిఫ్ట్ చేసి థాంక్స్ చెప్పారని కౌశల్ అనడం మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అంతటితో ఆగకుండా తనకు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చిందని త్వరలోనే ఆ వివరాలు కూడా తెలుపుతానని అనడం మరో వింత. అయితే మీకు 40 కోట్ల ఓట్లు ఎలా వచ్చాయి అనే దాని గురించి యాంకర్ ప్రశ్నించినప్పుడు దాటవేత సమాధానం ఇచ్చి తప్పించుకోడం కొసమెరుపు. అయితే ఇవన్నీ వచ్చాక ఆధారాలతో చెప్పుకుంటే బాగుంటదని సగటు ప్రేక్షకులు చెబుతున్న మాట.

Similar News