కౌశల్ మనసులో మాట..!

Update: 2018-10-08 07:12 GMT

బిగ్ బాస్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న కౌశల్ కి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది. కౌశల్ కి బయట డిమాండ్ మాములుగా లేదు. అతను బిగ్ బాస్ నుండి బయటికి రాగానే పలు వాణిజ్య సంస్థలు క్యూ కట్టేశాయి. ప్రస్తుతం అతను కొన్ని వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. త్వరలోనే అవి టీవీలలో టెలికాస్ట్ కానున్నాయి. ఫిలిం సెలబ్రెటీలకు దీటుగా అతను ఆదరణ సంపాదించుకున్నాడు.

అమెరికాలో త్వరలో షోలు...

త్వరలోనే అమెరికాలో అతడు షోస్ చేయనున్నాడు. నవంబర్ లో అమెరికాకు వెళ్లి అక్కడ కొన్ని నగరాల్లో షోలు చేయనున్నాడట. అంతేకాదు అతనికి పలు సినిమాల నుండి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. బోయపాటి తన సినిమాలో ఓ మంచి రోల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. కౌశల్ కూడా విలన్ పాత్రలు చేయడానికి రెడీ అంటున్నారు. రీసెంట్ గా అతను ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

అరవింద స్వామి తరహా పాత్ర అయితే...

'ధృవ' సినిమాలో అరవింద్ స్వామి చేసిన పాత్రలు లాంటివి చేయడం అంటే చాలా ఇష్టమని, ఆ తరహా విలన్ పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తానన్నాడు. తన యాటిట్యూడ్‌కి అటువంటి పాత్రలే సూటవుతాయని చెప్పాడు. ప్రత్యేకంగా అనిపించే క్యారెక్టర్లే చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇంత ఫాలోయింగ్ ఉంటుందనుకోలేదని.. బయటికి వచ్చాకా షాక్ అయ్యానని అన్నాడు. ఈ విజయం కౌశల్ ఆర్మీకే సొంతం అని అన్నాడు.

Similar News