ఇప్పటినుండే జాగ్రత్తగా ఉంటే చాలు..!

Update: 2018-10-03 08:40 GMT

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన కౌశల్ ఇరవయ్యేళ్లుగా టాలీవుడ్ లో ఉంటున్నాడు. ఎనభై సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించిన కౌశల్ టీవీ సీరియల్స్ లో కూడా చేసాడు. అయితే అవేవి కౌశల్ కి గుర్తింపు తీసుకు రాలేకపోయాయి. కానీ బిగ్ బాస్ అతని జీవితాన్ని మార్చేసిందనే చెప్పాలి. హౌస్ లో తన ప్రవర్తనతో జనాన్ని ఆకట్టుకున్న కౌశల్‌ చివరి వరకు ఉండి టైటిల్ కొట్టేసాడు. అంతాబాగానే ఉంది కానీ కౌశల్ నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ వేస్తాడని తన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో కౌశల్ బోయపాటి - చరణ్ సినిమాలో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇతను చేసే పాత్ర ఏమై ఉంటుందని అందరిలో మెదులుతున్న ప్రశ్న.

ఆఫర్స్ వస్తున్నా...

మరోపక్క డైరెక్టర్ మారుతి అతని పట్ల అభిమానం చూపిస్తున్నాడు కానీ తన నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తాడా? లేదా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. అలానే పూరి జగన్నాథ్‌ కూడా తన సినిమాలో నటిస్తావంటూ పేర్కొన్నా అది ఏ విధంగా వుంటుందనేది తెలీదు. మరి ఇన్ని ఆఫర్స్ నిజంగానే వస్తున్నాయో లేదో తెలియదు కానీ వస్తే మాత్రం ఆ అవకాశాలన్నీ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే బిగ్‌బాస్‌తో వచ్చిన హైప్‌ ఎంతో కాలం ఉండదు. రెండుమూడు నెలలు పోతే జనం తమ పనుల్లో బిజీ అయిపోతారు. కొత్త హీరోని, స్ఫూర్తిని వెతుక్కుంటారు. సో ఇప్పటినుండే చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. అప్పుడే ఫ్యూచర్ ఉంటుంది

Similar News