‘కౌశల్ ఆర్మీ’ దేవదాస్ సినిమాని బంతాట ఆడుతుందట

Update: 2018-09-19 05:12 GMT

గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియా వేదికగా ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ మరో స్టార్ హీరో ఫ్యాన్స్ సినిమాలకి నెగటివ్ టాక్ తెప్పించడం..కామెంట్స్ చేయడం..ఆ సినిమా మీద భారీ ఎత్తున నెగటివ్ మీమ్స్ ని క్రియేట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రెండేళ్ల కిందట మహేష్ ఫ్యాన్స్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలైనపుడు... పవన్ ఫ్యాన్స్ ‘బ్రహ్మోత్సవం’ విడుదలైనపుడు ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఒకరకంగా అతి చేశారనే చెప్పాలి. ఒక హీరోని ఒక్కరు తిట్టుకోడం ఇలా చాలానే చేశారు. వీరు ఇలా చేయడం వల్ల సినిమా జరిగే నష్టం ఏమి ఉండదు. ఏదో వాళ్ళ ఆనందం తప్ప. మహా అయితే ఆ సినిమా కలెక్షన్స్ కొంచం పెరుగుతాయి అంతే.

ఈనేపధ్యంలో సోషల్ మీడియాలో ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో వీళ్లు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో కౌశల్ ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో మిగతా పోటీదారులు, వాళ్ల అభిమానుల్ని దూషించడం..వారిని కొట్టడం ఇలా చాలానే చేస్తున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో రీసెంట్ గా హైదరాబాద్ , విజయవాడలో 2కే రన్ కూడా చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇదంతా చాలన్నదన్నట్లు హౌస్‌లో కౌశల్‌ను హీరో నాని టార్గెట్ చేసాడని.. అతని 'దేవదాస్' సినిమా లక్ష్యంగా చేసుకుంటామని సోషల్ మీడియాలో కౌశల్ ఫ్యాన్స్ మెసేజ్‌లు పెడుతుండటం గమనార్హం. ‘కౌశల్ ఆర్మీ’ తలుచుకుంటే నాని 'దేవదాస్' సినిమాని ప్లాప్ చేస్తుంది అని హెచ్చరిస్తున్నారు. మీరు ఏమి చేయాలనుకున్న సినిమా చూసేవాళ్లు చూస్తారు చూడని వారు చూడరు అని నాని ఫ్యాన్స్ రివర్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం వారి ప్రవాభం సినిమాపై ఎంత పడుతుందో

Similar News