కౌశల్... ఎందుకు ఈ హడావిడి..!

Update: 2018-10-02 07:02 GMT

గత రెండు రోజులుగా బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గురించే టీవీ ఛానల్స్ లో, వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కర్షన్స్. అతనేదో బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కానీ.. మారేదన్న సాధిస్తే కౌశల్ కి కౌశల్ ఆర్మీ గుడి కట్టినా కట్టేసేదే. అంతగా కౌషల్ కి కౌషల్ ఆర్మీ అంటూ ఫాన్స్ తయారయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ఏదో అంతా మంచే చేసినట్టుగా కౌశల్ కి ఫాన్స్ ఏమిటో... సదరు బుల్లితెర ప్రేక్షకులకు అర్థమైతే ఒట్టు. మిగతా వాళ్లు మొత్తం చెడ్డగా.. తానొక్కడినే మంచివాడిగా చెప్పుకునే కౌషల్ కూడా హౌస్ లో చాలా తప్పులు చేసాడు. కౌశల్ చాలాసార్లు నానినే తన మాటలతో పడగొట్టే ప్రయత్నం చేసాడు. ఏదో కౌశల్ ఆర్మీకి భయపడి స్టార్ మాతో పాటు నాని కూడా కౌషల్ ని పట్టించుకోలేదు కానీ.. లేదంటే కౌషల్ ఎప్పుడో బయటికెళ్లేవాడు. ఇక స్టార్ మా కూడా కౌశల్ ఆర్మీ చేసే హడావుడితో బిగ్ బాస్ కి మంచి రేటింగ్స్ వస్తున్నాయనే వంకతో కౌశల్ విషయంలో బిగ్ బాస్ కూడా చూసి చూడనట్టు వదిలేసాడు అని చాలామంది బహిరంగంగానే అంటున్నారు.

కౌశల్ ఆర్మీనే నిర్మాతలుగా...

ఇక హౌస్ మేట్స్ ని గెలవని కౌషల్ సోలోగా బిగ్ బాస్ విన్నార్ అయ్యాక ఏదేదో మాట్లాడుతున్నాడు. తానేంటో చూపిస్తానంటూ ఛానల్స్ కి ఎక్కి మరీ శపధాలు చేస్తున్నాడు. ఇక కౌశల్ కూడా కౌశల్ ఆర్మీని చూసి బాగా పొంగిపోయాడు. వాళ్ల కోసం హీరోనవుతానంటున్నాడు. ఇక దర్శకుల కోసం వెయిట్ చేస్తానంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో తనకెవరూ పోటీ కాదన్న కౌషల్ ఇండస్ట్రీలో కూడా తనకు హీరోలెవరు పోటీ కాదంటాడేమో అని సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు కౌశల్ ఆర్మీ వ్యతిరేకులు. ఇకపోతే కౌశల్ ఆర్మీ కోసం హీరో నవుతానంటున్న కౌశల్ ని చూసిన కౌశల్ ఆర్మీ అంటా కలిసి నిర్మాతలుగా మరి కౌశల్ హీరోగా సినిమా నిర్మించేందుకు అప్పుడే సన్నాహాలు జరుగుతున్నాయంటూ సదరు ఛానల్ యాంకర్ చెబుతుంది.

అంతా ప్లాన్ ప్రకారమేనా..?

కౌశల్ ఆర్మీగా ఫామ్ అయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా కలిసి 4 కోట్ల రూపాయలను పోగేసి ఒక సినిమా చేయనున్నట్టు ప్రచారం స్టార్ట్ అయ్యింది. గతంలో సినిమాల్లో,సీరియల్స్ లో, యాడ్స్ లో నటించిన అనుభవం కౌశల్ కి ఉంది. మరి కౌషల్ సోలో హీరోగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో చెప్తామంటున్నారు కౌశల్ ఆర్మీ సభ్యులు. మరి టీవీ ఛానల్ అనుభవంతో ఇన్నాళ్లు నెట్టేసిన కౌశల్ ఇప్పుడు హీరోగా మరి ఏం సాధిస్తాడా అనేది కాస్త అనుమానమే. ఎందుకంటే బోలెడంత క్రేజున్న శివ బాలాజీనే బిగ్ బాస్ సీజన్ విన్నారయ్యాక ఎటువంటి చడీ చెప్పు లేకుండా సినిమాల్లో చిన్న చిన్న వేషాలతో నెట్టకొస్తున్నాడు. కానీ కౌషల్ మాత్రం హీరోనవుతానంటూ బయలుదేరడం.. మధ్యలో పవన్ కళ్యాణ్, మహేష్ ల పేర్లు కౌశల్ ఉచ్చరించడం.. అంతా కౌశల్ ప్లాన్ లో భాగం అని.. మహేష్, పవన్ పేర్లు వాడుకుని పైకి రావాలని చూస్తున్నాడంటున్నారు కౌశల్ యాంటీ ఫ్యాన్స్.

Similar News