మనసులో మాట చెప్పిన కౌశల్..!

Update: 2018-10-13 12:25 GMT

ఎన్నాళ్ల నుండో వెయిట్ చేస్తున్న కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చింది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ కోసం అటు ఇండస్ట్రీతో పాటు వారి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేసారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అరవింద సమేత సినిమా చూసిన వాళ్లంతా, ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని అంటున్నారు. ఇక జగపతి బాబు పాత్ర గురించి అయితే కథలు కథలుగా చెబుతున్నారు. ఇండియాలో ఎన్ని అవార్డ్స్ ఉంటే అవి అన్ని జగపతి బాబుకి వచ్చేలా నటించారని చెబుతున్నారు. ఈ సినిమాను చూసిన ఇండస్ట్రీ జనాలు తమదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ నేపధ్యంలో కౌశల్ కూడా ఈ సినిమాపై స్పందించాడు.

మనస్సులో మాట బయటపెట్టిన కౌశల్

ఎన్టీఆర్ ఇందులో చాలా గొప్పగా నటించాడని.. అతని నటన నాలాంటి వారికి ఒక బుక్ లాంటిది అని అన్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు నటన చూసాకా అటువంటి పాత్ర నాకు కూడా పడితే బాగుండని తన మనసులో మాట చెప్పాడు. ఎన్టీఆర్ సినిమాలో నాకు విలన్ గా నటించాలని వుందని చెప్పుకొచ్చాడు. దీంతో కౌశల్ ఆర్మీ సభ్యులు ఎన్టీఆర్ సినిమాలో కౌశల్ చేస్తే చూడాలని ఉందని అంటున్నారు. అయితే కొంతమంది దర్శక నిర్మాతలు విలన్ పాత్రల కోసం కౌశల్ ను సంప్రదిస్తున్నారు. మరి కౌశల్ ఏ హీరోతో ఎంట్రీ ఇస్తాడో చూడాలి. ఎన్టీఆర్ సినిమాలో నటించాలంటే కొంత టైం పట్టె అవకాశముంది.

Similar News