కౌశల్ కల నిజం అవ్వబోతుంది

తెలుగు లో బిగ్ బాస్ 1 తో పోల్చితే బిగ్ బాస్ 2 అంత గొప్పగా ఏమి లేకపోయినా అందులో పార్టిసిపెంట్స్ కు మాత్రం మంచి క్రేజ్ [more]

Update: 2019-01-13 07:03 GMT

తెలుగు లో బిగ్ బాస్ 1 తో పోల్చితే బిగ్ బాస్ 2 అంత గొప్పగా ఏమి లేకపోయినా అందులో పార్టిసిపెంట్స్ కు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా కౌశల్ కు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు బయటికి వచ్చాకా కౌశల్ పై ట్రోల్ల్స్ మాత్రం ఆగలేదు. అయినా కానీ మనోడు అన్నిటిని ఎగురుకుంటూ ముందుకు వచ్చాడు.

బిగ్ బాస్ కి రాకముందు కౌశల్ సీరియల్స్ లో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసి, ఇప్పుడు తాను అనుకున్న గోల్ కి రీచ్ అవుతున్నాడు. అవును కౌశల్ కు ఓ సినిమా ఛాన్స్ వచ్చింది. అలా అని చిన్నచిన్న పాత్ర కాదు ఏకంగా కౌశల్ ని హీరోగా పెట్టి ఒక ప్రముఖ నిర్మాత సినిమా తీయబోతున్నాడట.

అందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చకచకా జరుగుతుందని సమాచారం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ ప్రముఖ నిర్మాత మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని టాక్ వస్తోంది. ఒక యంగ్ డైరెక్టర్ రెడీ చేసిన కథ కు కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈమూవీ కథ పవన్ రాజకీయాల నుంచి ఆధారంగా చేసుకొని సెట్ చేసుకున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈసినిమాకు ‘సేనాని’ టైటిల్ ను అనుకుంటున్నట్టు టాక్. త్వరలోనే కౌశల్ నటించబోయే సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. అలానే నూతన నాయుడు కి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. నిన్న రిలీజ్ అయినా F 2 లో వెన్నెల కిషోర్ పక్కన చిన్న రోల్ లో కనిపించాడు.

Tags:    

Similar News