మహేష్ పక్కన కత్తి లాంటి హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. మహేష్ ఇందులో సరికొత్తగా కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయినా [more]

Update: 2019-01-15 06:42 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. మహేష్ ఇందులో సరికొత్తగా కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయినా స్టిల్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈసినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు.దీనిపై అధికార ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈసినిమా లో మహేష్ కు సరసన బాలీవుడ్ బామ కత్రినాను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. తెలుగులో కత్రినా చాలా తక్కువ సినిమాలు చేసింది.

వెంకటేష్ ‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ బామ తరువాత బాలయ్య సరసన ‘అల్లరి పిడుగు’ లో నటించింది. ఆ తరువాత నుండి తెలుగు సినిమాలు ఒప్పుకోలేదు. బాలీవుడ్ లో వరసగా పెద్దపెద్ద ఆఫర్స్ రావడంతో తెలుగు వైపు చూడలేదు. అయితే రీసెంట్ గా సుకుమార్ ఆమెను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఆమె నిర్ణయం ఏంటో ఇంకా చెప్పలేదని తెలుస్తుంది.

Tags:    

Similar News