సినిమా అయినా.. ఎక్కడైనా అదే క్రేజ్!!

బాలీవుడ్ లో స్పెషల్ అండ్ ఐటెం సాంగ్స్ కి పెట్టింది పేరైన కత్రినా కైఫ్ ఈ ఏడాది భారత్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించి [more]

Update: 2019-06-22 08:35 GMT

బాలీవుడ్ లో స్పెషల్ అండ్ ఐటెం సాంగ్స్ కి పెట్టింది పేరైన కత్రినా కైఫ్ ఈ ఏడాది భారత్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించి ఆ సినిమాతో హిట్ అందుకుంది. హీరోయిన్స్ గా దీపికా,ప్రియాంక లాంటి వాళ్ళకి ఎంత క్రేజ్ ఉంటుందో కత్రినా కైఫ్ ఐటెం సాంగ్స్ కి అంత పేరుంటుంది. కత్రినా ఐటెం సాంగ్ లో డాన్స్ చేసింది అంటే చాలు.. ప్రేక్షకులకు కూడా ఊపొచ్చేస్తుంది. అలా కత్రినా స్టెప్స్ కి ఫిదా అవ్వాల్సిందే. అంత క్రేజ్ ఉన్న కత్రినా లైవ్ లో డాన్స్ చేస్తే అభిమానులు ఊరుకుంటారా.. తాజాగా కత్రినా ఓ కాస్ట్లీ పెళ్లి లో భీభత్సమైన స్టెప్స్ తో అల్లాడించిందట.

డెహ్రాడూన్‌లోని ఔలీ ప్రాంతానికి చెందిన ఒక డబ్బు గల కుటుంబం ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ పెళ్లిని నిర్వహించింది. అయితే 200 కోట్ల పెళ్లి అంటే… ఆ పెళ్లిలో సంగీత్ ఏ రేంజ్ లో ఉండాలి . అందుకే ఏకంగా ఆ కుటుంబం కత్రినా కైఫ్ తో డాన్స్ చేపించేసింది. మరి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తే ఎవ్వరైనా టెంప్ట్ అవడం సహజమే. అలానే కత్రినా కైఫ్ కూడా ఆ పెళ్ళిలో భారీ మొత్తానికి తన డాన్స్ పెరఫార్మెన్సు ఇచ్చింది. ఇక కత్రినా తో పాటుగా.. ఇంకా బాలీవుడ్ టీవీ సెలెబ్రిటీస్ ని కూడా ఆ పెళ్ళిలో డాన్స్ చెయ్యడానికి తీసుకొచ్చారట. ఇక కత్రినా తన హాట్ స్టెప్స్ తో తీస్‌ మార్‌ ఖాన్‌ సినిమాలోని షీలా కీ జవానీ పాటను ఇరగదీసిందట. మరి కత్రినా వేసిన ఆ డాన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

Tags:    

Similar News