కథానాయకుడు ఎంత వరకు వచ్చింది..?

Update: 2018-10-04 08:48 GMT

ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ మొదలు పెడుతున్నాన్నప్పుడు ఎన్నో సందేహాలు... మరెన్నో అనుమానాలు. ఈ సినిమా కేవలం టీడీపీ కోసమే తీస్తున్నట్లుగా రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ఇక దర్శకుడిగా తేజతో ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీదకెళ్లింది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటికి రావడం... ఆ ప్లేస్ లోకి దర్శకుడు క్రిష్ ఎంటర్ అవడం జరిగిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని క్రిష్ పరిగెత్తించేస్తూ... సినిమా మీద అంచనాలు పెంచేలా చేసాడు. ఇక బాలయ్య కూడా క్రిష్ తో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో విరామమే లేకుండా పాల్గొంటున్నాడు. మరి సినిమాని ఆఘమేఘాల మీద తెరకెక్కించి సంక్రాంతికి విడుదల చెయ్యాలి. ఇక ఎన్టీఆర్ జీవితాన్ని ఒక పార్ట్ లో చూపెట్టడం కుదిరే పని కాదని ఎప్పటినుండో అంటున్నారు.

రెండో పార్ట్ నూ పూర్తి చేసే పనిలో...

అందరూ అన్నట్టుగానే క్రిష్- బాలయ్య లు కలిసి ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా చెయ్యడానికి డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్ నట జీవితం ఎన్టీఆర్ - కథానాయకుడు గా, రాజకీయ జీవితం ఎన్టీఆర్- ప్రజానాయకుడిగా చెయ్యడానికి రెడీ అయ్యారు. అయితే కథానాయకుడు పార్ట్ ని కంప్లీట్ చేసి... ఇక మిగిలిన రాజకీయ జీవితాన్ని కూడా క్రిష్ ఆఘమేఘాల మీద పూర్తి చెయ్యబోతున్నాడట. మరి ఎన్టీఆర్ జీవితంలో నట జీవితం కన్నా... రాజకీయ జీవితంలోనే అనేకరకాల ట్విస్ట్ లు... ఆసక్తికర మలుపులు చాలా ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ నట జీవితం కథానాయకుడు చూసిన ప్రేక్షకులకు ఎన్టీఆర్ రాజకీయ జీవితం మీద పిచ్చ ఇంట్రెస్ట్ పుట్టడం మాత్రం ఖాయం. ఇక బడ్జెట్ కూడా ఇప్పుడు బయోపిక్ రెండు పోర్ట్ లకు కలిపి 70 నుండి 80 కోట్లు అవుతుందట. నిన్నటివరకు ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ 100 కోట్లే... కానీ ఇప్పుడు తాజాగా రెండు పోర్ట్ లకు కలిపి 150 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. మొత్తానికి క్రేజుకి క్రేజు.... డబ్బుకి డబ్బు.

Similar News