ఏది బెటర్ అంటారు

గత వారం విడుదలైన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సో సో టాక్ తో సో సో కలెక్షన్స్ తో పెట్టిన పెట్టుబడి తెచ్చుకోలేక నానా ఇబ్బందులు [more]

Update: 2019-08-03 07:13 GMT

గత వారం విడుదలైన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సో సో టాక్ తో సో సో కలెక్షన్స్ తో పెట్టిన పెట్టుబడి తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతుంది. ఈలోపు నిన్న శుక్రవారం బెల్లకొండ శ్రీనివాస్ -రమేష్ వర్మ ల రాక్షసుడు, అర్జున్ జంధ్యాల – కార్తికేయ కాంబోలో తెరకెక్కిన గుణ 369 సినిమాలు బాక్సాఫీసు వద్దకు వచ్చేసాయి. రాక్షసుడు, గుణ 369 మీద ఒకేలాంటి అంచనాలున్నాయి. ఐదారు సినిమాలు చేసినా సూపర్ హిట్ కొట్టని బెల్లంకొండ, మొదటి సినిమాతో హిట్ అనిపించుకుని నెక్స్ట్ సినిమాతో భారీ డిజాస్టర్ కొట్టిన కార్తికేయ ఇద్దరు ఒకేలాంటి అంచనాలతో బాక్సాఫీసు వద్ద తలపడ్డారు. అయితే బెల్లకొండ రాక్షసుడు సినిమాకి పాజిటివ్ అండ్ హిట్ టాక్ పడగా.. కార్తికేయ గుణ 369 కి యావరేజ్ టాక్ పడింది.

తమిళ హిట్ మూవీ రచ్చసన్ ని తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. రాక్షసుడు సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం, పాత్రల తీరుతెన్నులు బలాలు. నిడివి ఎక్కువ కావడం, కమర్షిల్ ఎలిమెంట్స్ లేకపోవడం బలహీనతలు. ఇక కార్తికేయ గుణ 369 సినిమాకి నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, కార్తికేయ నటన బలాలైతే… పాటలు, నిర్మాణ విలువలు, కథ, కథనం, ఎడిటింగ్ లాంటివి బలహీనతలు. ఇక రివ్యూ రైటర్స్ బెల్లకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమాకి మిక్స్డ్ అండ్ హిట్ రేటింగ్స్ ఇచ్చారు. ఇక కార్తికేయ గుణ 369 కి యావరేజ్ రేటింగ్స్ తోనే సరిపెట్టేసారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వానికి కొత్త కావడం, కథనం లో వీక్ వలన గుణ కి యావరేజ్ టాక్ పడింది.ఇక ప్రేక్షకులు ఫైనల్ గా ఈ రెండు సినిమాల్లో రాక్షసుడు సినిమాకే ఓటేసినట్లుగా కనబడుతుంది.

Tags:    

Similar News