ఆరు కోట్లు కొల్లగొడుతుందా..?

కార్తీ – రకుల్ ప్రీత్ సింగ్ ల దేవ్ సినిమా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రేపు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దేవ్ తమిళ చిత్రం [more]

Update: 2019-02-13 08:18 GMT

కార్తీ – రకుల్ ప్రీత్ సింగ్ ల దేవ్ సినిమా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రేపు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దేవ్ తమిళ చిత్రం కావడంతో.. సినిమా మీద పెద్దగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరచడం లేదు. అందుకే దేవ్ సినిమాకి బుకింగ్స్ కూడా నామమాత్రంగానే ఉన్నాయి. కార్తీ క్రేజ్ కన్నా ఎక్కువగా రకుల్ ప్రీత్ క్రేజ్ తో దేవ్ సినిమాకి బుకింగ్స్ ఉంటాయని ఆ సినిమాని కొన్న తెలుగు నిర్మాత ఠాగూర్ మధు ఆశించారు. కానీ బుకింగ్స్ ఆశాజనకంగా కనిపించడం లేదు. కార్తీ గత చిత్రాల క్రేజ్ తో, తెలుగులో రకుల్ ప్రీత్ క్రేజ్ తో తెలుగు నిర్మాత ఠాగూర్ మధు దేవ్ చిత్రాన్ని ఏకంగా 6 కోట్లకి డబ్బింగ్ హక్కులను కొన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దేవ్ తెలుగు హక్కులను ఠాగూర్ మధు 6 కోట్లకి కొనుగోలు చేసాడు.

పోటీగా వ‌స్తున్న ల‌వర్స్ డే

అయితే కార్తీ గత చిత్రాలైన చినబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడున్నర కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తే… కార్తీ సూపర్ హిట్ చిత్రం ఖాకీ.. ఐదున్నర‌ కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఖాకీ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ కావడం.. సినిమా కంటెంట్ ప్రేక్షకులకు మెచ్చేలా ఉండడంతో ఆ సినిమాకి ఐదున్నర కోట్లు వచ్చాయి. మరి ప్రస్తుతం పెద్దగా బజ్ లేని దేవ్ చిత్రానికి 6 కోట్లు వస్తాయంటే కాస్త కష్టమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే తెలుగులో సినిమాలు లేకపోవడం, ఎఫ్ 2 చిత్రం తర్వాత మళ్లీ బాక్సాఫీసు వద్ద క్రేజున్న సినిమాలేవీ లేకపోవడం… దేవ్ సినిమాకి కలిసొచ్చే అంశం. కానీ మలయాళ చిత్రం లవర్స్ డే కూడా రేపే విడుదలవుతుంది. అయితే ఆ సినిమాలో ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా నటించడంతో… ఆ సినిమా మీద కాస్త క్రేజ్ వచ్చింది. అయితే లవర్స్ డే కన్నా కాస్త ఎక్కువగా దేవ్ సినిమాకే క్రేజ్ ఉంది. కాకపోతే ఆరు కోట్లు కొల్లగొట్టే క్రేజ్ ఉందా అనేది అనుమానమే.

Tags:    

Similar News