'దేవ్' గా రాబోతున్న కార్తీ

Update: 2018-06-01 08:35 GMT

తమిళ్ హీరో సూర్య తమ్ముడు కార్తీ తన మొదటి సినిమా నుంచి ప్రతీ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ హైలైట్ అయ్యే విధంగా చూసుకుంటాడు. మొదటి నుండి వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడు రజత్ రవిశంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'దేవ్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

హైదరాబాద్ లో షూటింగ్

లేటెస్ట్ గా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను రేపటి నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేయనున్నారు. 10 రోజుల పాటు ఇక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ను యూరప్ లో, హిమాలయాల్లో ప్లాన్ చేశారు.

మళ్లీ జోడీగా రకుల్...

అక్కడ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇందులో కార్తీ కి జోడిగా మరోసారి రకుల్ ప్రీత్ నటిస్తుంది. ఈ మధ్యే వీరి కాంబినేషన్ లో వచ్చిన ఖాకీ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Similar News