మళ్ళీ సైజు జీరో లోకి మారిపోయిన తార

Update: 2018-05-10 04:14 GMT

బాలీవుడ్ కి జీరో సైజు ని పరిచయం చేసిన తార కరీనా కపూర్. కరీనా కపూర్ జీరో సైజు లోకి మారినాక అనేక హిట్స్ అందుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే సైఫ్ అలీ ఖాన్ ని పెళ్ళాడి అతనికి రెండో భార్యగా సైఫ్ ఇంట అడుగు పెట్టింది. సైఫ్ తో చాలా కాలం ప్రేమాయణం సాగించిన కరీనా కపూర్ సైఫ్ ని పెళ్లాడిన తర్వాత కూడా సినిమా లు చేస్తూనే ఉంది. ఇక కరీనా ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు కూడా ఎటువంటి మొహమాటానికి పోకుండా అనేక అవార్డు ఫంక్షన్స్ కి అలాగే యాడ్ షూట్స్, ఫోటో షూట్స్ అంటూ నిత్యం హడావిడి చేసేది. ఇక కరీనా కి బాబు పుట్టాక కూడా తనకున్న కమిట్మెంట్ తో కరీనా ఎక్కువ శాతం జిమ్ లలో వర్కౌట్స్ చేస్తూ బాగా సన్న బడింది.

అయితే కరీనా కపూర్ మళ్ళీ సినీమాల్లో బిజీ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే అలా ఫిట్నెస్ మీద కాన్సంట్రేట్ చేసింది. అందుకే వర్కౌట్స్ అంటూ జిమ్స్ లో కష్ట పడింది. అయితే సన్నబడడం అయితే సన్నబడింది కానీ ఆమె మోహంలో గ్లో మాత్రం పోయింది. ఎప్పుడూ బాబ్లీ పేస్ తో ఉండే కరీనా బాడీ ఫిట్నెస్ తో మొహంలో కళను పోగొట్టుకుంది. ఇక ప్రస్తుతం కరీనా చూసిన ఎవ్వరైనా అమ్మడు మళ్ళీ జీరో సైజు ట్రై చేస్తుంది అని ఖచ్చితంగా అనుకుంటారు. తాజాగా సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలకి హాజరైన కరీనా అచ్చం జీరో సైజు ని మళ్ళీ ట్రై చేస్తుందిగా అనుకునేలా కనబడుతుంది. వెడ్డింగ్ సెర్మనీ కి అందమైన నిండైన డ్రెస్ లో భర్త, పిల్లడు తైమూర్ అలీ ఖాన్ తో కలిసి విచ్చిన కరీనా.. సోనమ్ రిసెప్షన్ కి మాత్రం క్లివేజ్ షోకులతో మరీ బక్క చిక్కిన భామలా అక్క కరిష్మా, భర్త సైఫ్ తో హాజరైంది. హాట్ అందాలు బాలీవుడ్ కి కొత్తేమి కాదు... కానీ మరి ఇలా చిక్కిన అందాలు చూసేందుకు మాత్రం ఎవరు ఇంట్రెస్ట్ చూపరు.

మరి కరీనా కపూర్ సినిమాల మీద మోజుతో ఉన్న అందాన్ని ఇలా సైజు జీరో తో చెడగొట్టుకుంటుంది. మరి సైజు జీరో లో అలా సన్నగా కనబడితే ఓకె గాని.. ఉన్న అందాన్ని, గ్లో ని పోగొట్టుకుంటే...మాత్రం కష్టం కరీనా..!

Similar News