కరణ్ అంత నష్టపోతున్నాడా..?

బాలీవుడ్ లో కరణ్ జొహార్ నిర్మాతగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో బడా మల్టీస్టారర్ గా తెరకెక్కిన కళంక్ సినిమా డివైడ్ టాక్ తో సూపర్ హిట్ ఓపెనింగ్స్ [more]

Update: 2019-04-24 07:44 GMT

బాలీవుడ్ లో కరణ్ జొహార్ నిర్మాతగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో బడా మల్టీస్టారర్ గా తెరకెక్కిన కళంక్ సినిమా డివైడ్ టాక్ తో సూపర్ హిట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కళంక్ సినిమాలో మాధురి దీక్షిత్, సంజయ్ దత్ లు ఏళ్ల తర్వాత కలిసి నటించడం, అలియా భట్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ.. సినిమాలో కంటెంట్ వీక్ గా ఉందనడంతో సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయితే కళంక్ లో మాధురి దీక్షిత్, అలియా భట్, సంజయ్ దత్ ఎవరికి వారే అదుర్స్ అనే రేంజ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారంతా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించలేదు.. జీవించారు. అయినప్పటికీ సినిమాలో కంటెంట్ వీక్ గా ఉండడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది.

50 కోట్ల నష్టం తప్పదా..?

మరి భారీ అంచనాలతో థియేటర్స్ లోకి దిగిన కళంక్ కి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ భారీ కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. ఈ సినిమాని కరణ్ జోహార్ 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. కానీ వారం రోజుల్లో ఈ సినిమా 75 కోట్ల మార్కును కూడా దాటలేకపోయింది. మరి 150 కోట్లకి కేవలం 70 కోట్లు మాత్రమే వస్తే.. ఆ లెక్కన 50 కోట్ల నష్టాన్ని కరణ్ జోహార్ భరించాల్సి ఉంటుందని బి టౌన్ కోడై కూస్తుంది. మరి కరణ్ తండ్రి నిర్మించాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఆగిపోవడంతో తండ్రి డ్రీం ప్రాజెక్ట్ ని కరణ్ జోహార్ నిర్మించి చేతులు కాల్చుకున్నాడని అంటున్నారు. ఎంతగా క్రేజున్న నటులు సినిమాలో ఉన్నా కథలో బలం లేకపోతె ఇలాంటి నష్టాలే వస్తాయంటున్నారు.

Tags:    

Similar News