అన్ని రోజులు ఒకేలా ఉండవు కరణ్..!

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఏది పట్టుకున్నా బంగారమే. ఈమధ్య కాలంలో అతను ఏ సినిమా నిర్మించిన అది సూపర్ హిట్ అవుతుంది. సౌత్ నుండి బాహుబలితో [more]

Update: 2019-04-18 08:43 GMT

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఏది పట్టుకున్నా బంగారమే. ఈమధ్య కాలంలో అతను ఏ సినిమా నిర్మించిన అది సూపర్ హిట్ అవుతుంది. సౌత్ నుండి బాహుబలితో పాటు ‘2.ఓ’ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అవి కూడా బ్లాక్ బస్టర్లయ్యాయి. ‘2.ఓ’ చిత్రం మన సౌత్ లో ఆడలేదు కానీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. ఇక గత ఏడాది చివరిలో వచ్చిన ‘సింబా’ కూడా బ్లాక్ బస్టర్ అయింది. అలా మనోడికి తిరుగు లేకుండా పోయింది. కరణ్ లేటెస్ట్ గా ‘కళంక్’ అనే సినిమాను నిర్మించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనుకున్నారంతా.

‘కళాంక్’ సినిమాకు ఫ్లాప్ టాక్

ట్రైలర్ చూసి ఏదో ఊహించుకున్నారు ప్రేక్షకులు. కానీ రిజల్ట్ వేరేలా వచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఉదయం షో నుంచే సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై కామెడీ కూడా చేసుకుంటున్నారు. సరైన కథాకథనాలు లేకుండా బోరింగ్‌గా సినిమాను నడిపించడంతో ప్రేక్షకులు థియేటర్లలో తలపట్టుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఇంత చెత్త సినిమా రాలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలో ఆర్టిస్ట్స్ పెర్ఫామెన్స్, విజువల్స్ తప్ప ఏమీ లేదని అంటున్నారు ప్రేక్షకులు.

Tags:    

Similar News