ఎందుకంతా వాళ్ళ మీద పడుతున్నారు!!

బాలీవుడ్ వరస విషాదాలు అభిమానులను కోలుకోకుండా చేస్తున్నాయి. అభిమానులకే కాదు.. సెలబ్రిటీస్ కి రాజకీయనాయకులకు అందరికి ఇది తీరని లోటు. సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య అందరిని [more]

Update: 2020-06-17 09:06 GMT

బాలీవుడ్ వరస విషాదాలు అభిమానులను కోలుకోకుండా చేస్తున్నాయి. అభిమానులకే కాదు.. సెలబ్రిటీస్ కి రాజకీయనాయకులకు అందరికి ఇది తీరని లోటు. సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య అందరిని కలిచివేసింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య, అంత్యక్రియలు ముగియకముందే సుశాంత్ సింగ్ రాజపుట్ వదిన సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక కన్ను మూయడం మరింత విషాదం. అయితే సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి బాలీవుడ్ సెలబ్రిటీస్ పెద్దలే కారణమని బాలీవుడ్ వివాదాస్పద నటి కంగానా హాట్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ని ఊపేస్తున్నాయి.

బాలీవుడ్ పెద్దల నిర్లక్ష్యం వలనే యువ కిరణం రాలిపోయింది అని అంటుంది కంగనా. అయితే కరణ్ జోహార్, అలియా భట్ ల మీద ఇప్పుడు నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. కరణ్ జోహార్ సుశాంత్ సింగ్ చనిపోయిన రెండో రోజు.. నీతో ఏడాదిగా నేను గడపకపోవడం నా తప్పే.. అంటూ ట్వీట్ చెయ్యడం, అలియా భట్ కూడా కాఫీ విత్ కరణ్ జోహార్ షో లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఎవరో తెలియదనడం, అతనిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన అలియాని చూసి కరణ్ కూడా ఎగతాళిగా నవ్వడం వంటి విషయాలతో నెటిజెన్స్ మీలాంటి వల్లే ఇలాంటి యంగ్ టాలెంటెడ్ నటులు ప్రాణాలు తీసుకుంటున్నారని అంటూ అలియా భట్, కరణ్ జోహార్ లపై ఫైర్ అవుతున్నారు. మరోపక్క కరణ్ జోహార్ నిర్మించిన సినిమాలు కానీ, అలియా భట్ నటించిన సినిమాలు కానీ బాయ్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు.

Tags:    

Similar News