వామ్మో మరీ అంత డిమాండా?

బాలీవుడ్ వాళ్ళకి బియోపిక్స్ కొత్తేమి కాదు. కాకపోతే ఈమధ్య బియోపిక్స్ ట్రెండ్ అవ్వడంతో ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. పైగా క్రికెటర్స్ జీవితం మీద బయోపిక్ [more]

Update: 2019-06-15 08:19 GMT

బాలీవుడ్ వాళ్ళకి బియోపిక్స్ కొత్తేమి కాదు. కాకపోతే ఈమధ్య బియోపిక్స్ ట్రెండ్ అవ్వడంతో ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. పైగా క్రికెటర్స్ జీవితం మీద బయోపిక్ అంటే ఆ క్రేజ్ వేరు. ప్రస్తుతం హిందీ లో క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. ఈచిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వం చేస్తున్నాడు. ’83’ అనే టైటిల్ తో వస్తున్నా ఈచిత్రంలో 1983లో టీం ఇండియా ప్రపంచ కప్ ను గెలిచిన తీరును చిత్రంలో చూపించబోతున్నారు. ఇందులో ఆ సమయంలో ని ఆటగాళ్ల ఆట తీరు మరియు వారి భావోద్వేగాలను చూపించేందుకు దర్శకుడు స్క్రిప్ట్ ను సిద్దం చేసుకున్నాడు.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తున్న ఈసినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం రణ్వీర్ క్రికెట్ మెలుకువలు నేర్చుకోవడంతో పాటు కపిల్ కు చెందిన పలు విషయాలను తెలుసుకున్నాడు. అయితే కపిల్ దేవ్ పాత్ర ఎవరూ నటిస్తారు అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది.రణ్వీర్ భార్య అంటే దీపికా పదుకునే కపిల్ దేవ్ భార్య గా నటించేందుకు ఓకే చెప్పిందట. కేవలం పావు గంట నిడివి కలిగిన పాత్రను చేసేందుకు దీపిక పదుకునే ఏకంగా 14 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా నుండి సమాచారం అందుతుంది. ఆమె క్రేజ్ దృశ్య ఆమె అడిగిందంట ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు మేకర్స్. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News