ఆమెతో సినిమా చెయ్యడానికి వణుకుతున్నారా..?

ప్రస్తుతం కంగనాతో పెట్టుకుంటే ఏ రేంజ్ లో ఆడుకుంటుంది అనేది మణికర్ణిక విషయంలోనే తేటతెల్లమైంది. గౌతమి పుత్ర చేశాక బాలీవుడ్ లో కంగనాతో క్రిష్ మణికర్ణిక సినిమా [more]

Update: 2019-02-11 06:13 GMT

ప్రస్తుతం కంగనాతో పెట్టుకుంటే ఏ రేంజ్ లో ఆడుకుంటుంది అనేది మణికర్ణిక విషయంలోనే తేటతెల్లమైంది. గౌతమి పుత్ర చేశాక బాలీవుడ్ లో కంగనాతో క్రిష్ మణికర్ణిక సినిమా తెరకెక్కిస్తున్నప్పుడే… కంగనాతో దర్శకుడు క్రిష్ కి విభేదాలు మొదలయ్యాయి. ఇక చివరికొచ్చేసరికి కంగనాతో వేగలేక క్రిష్ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాడు. కంగనా మాత్రం కంకణం కట్టుకుని మణికర్ణికతో ఎలాగో తిప్పలు పడి… మిగిలిన డైరెక్షన్, విఎఫెక్స్ అన్ని పూర్తి చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఆ సినిమాలో కంగనా నటనకు మంచి మార్కులు రావడం.. ఆమె డైరెక్షన్ ని కొంతమంది పొగడడంతో… అసలే పారితోషకం అందుకోని క్రిష్ మీడియా ముందు కంగనాని నానా మాటలు అన్నాడు. కంగనా ఎందుకు ఊరుకుంటుంది. అసలే తనతో పెట్టుకున్నవాళ్లకి ఎలాంటి గతి పట్టిస్తుంది అనేది బాలీవుడ్ జనాలకు మాత్రమే తెలుసు.

ఆమెతో సినిమా చేసే ధైర్యం చేస్తారా..?

తాజాగా క్రిష్ కూడా తెలుసుకున్నట్టుగా కనబడుతుంది. అందుకే కంగనాకు కౌంటర్లు ఇవ్వడం ఆపేసాడు. ఇక కంగానాతో గతంలో హృతిక్ రోషన్, కరణ్ జోహార్ ఇంకా చాలామంది ప్రముఖులు పెట్టుకుని సైలెంట్ అయినా వాళ్లే. కంగనా చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి రచ్చ చేసే క్యారెక్టర్ ఆమెది. అందులోనూ వారసత్వ నటీనటులంటే ఒళ్లు మంట. ఇక ఇప్పుడు కంగనా రనౌత్ తో సినిమా చెయ్యాలంటే దర్శకనిర్మాతలు వణకాల్సిన పరిస్థితి. ఏదో టాలెంట్ ఉంది కదా ఆమెతో సినిమా చేద్దామనుకుంటే.. సినిమా పూర్తయ్యే లోపల కంగనాతో వాళ్లకు ఎలాంటి సమస్య వస్తుందో అనే ఆలోచనతో ఆమెతో సినిమాలు చెయ్యడానికి ఎవరూ ధైర్యం చెయ్యడం లేదట. మరి మణికర్ణికకు నేనే డైరెక్టర్ అని చెప్పుకుంటున్న కంగనా ఫ్యూచర్ లో తాను హీరోయిన్ గా చేసే సినిమాలు తానే డైరెక్ట్ చేసుకోవాల్సి వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News